close

శుక్రవారం, నవంబర్ 22, 2019

ప్రధానాంశాలు

మలయాళీ పాయసం ఇష్టం

కళోత్సవం-2019లో గవర్నర్‌ తమిళిసై

కార్ఖానా: మలయాళీ పాయసం ఎంతో ఇష్టమని తెలంగాణ గవర్నర్‌ తమిళిసై తెలిపారు. సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌లోని ఎం.ఎం.ఆర్‌ గార్డెన్‌లో ఆదివారం రాత్రి ఆలిండియా మలయాళీ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన కళోత్సవం- 2019 కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిÅగా హాజరై మాట్లాడారు.  మలయాళీ సంస్కృతి, సంప్రదాయాలంటే తనకు ఎంతో గౌరవమని, వారి కట్టు బొట్టు ఎంతో ముచ్చటగొల్పుతుందన్నారు. కేరళలో వాతావరణం ఎంతో బాగుంటుందన్నారు. తెలంగాణలో తమిళులు, మలయాళీలు సోదరభావంతో ఉంటారని, ఇది ఈ ప్రాంతం ప్రత్యేకత అని కొనియాడారు. సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. కార్యక్రమంలో అసోసియేషన్‌ ఛైర్మన్‌ సురేంద్రన్‌, అధ్యక్షుడు ప్రసాద్‌, ప్రధాన కార్యదర్శి శశికుమార్‌, కోశాధికారి వర్గీస్‌, ప్రతినిధి చంద్రమోహన్‌ పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.