close

మంగళవారం, నవంబర్ 19, 2019

ప్రధానాంశాలు

వృత్తిలో సవాళ్లను అధిగమించాలి

● అదనపు ఎస్పీ వెంకటేశ్వర్లు

● పోలీసు అమరవీరులకు నివాళి అర్పించిన జడ్పీ ఛైర్‌పర్సన్‌ స్వర్ణ సుధాకర్‌


ఈ ఏడాది మృతి చెందిన పోలీసుల వివరాలు తీసుకొస్తున్న అధికారులు

మహబూబ్‌నగర్‌ (నేరవిభాగం), న్యూస్‌టుడే : పోలీసు శాఖలో పని చేస్తున్న అధికారులు, సిబ్బంది వృత్తిలో సవాళ్లను అధిగమించినప్పుడే శాంతిభద్రతల పరిరక్షణకు అవకాశం ఉంటుందని అదనపు ఎస్పీ వెంకటేశ్వర్లు అన్నారు. సోమవారం జిల్లా ఎస్పీ కార్యాలయం ఆవరణలోని కవాతు మైదానంలో పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని నిర్వహించారు. ముందుగా కార్యాలయం ఎదుట ఉన్న పోలీసు అమరవీరుల స్తూపం వద్ద నివాళి అర్పించిన అనంతరం కవాతు మైదానంలో నిర్వహించిన కార్యక్రమంలో అదనపు ఎస్పీ మాట్లాడారు. సమాజానికి శాంతిని అందిస్తే ప్రజల జీవనంలో సంతోషంతో పాటు అభివృద్ధిని చూసేందుకు అవకాశం ఉందని అన్నారు. ప్రజలు శాంతి కాముకులైనప్పటికీ కొందరు ఇబ్బందులు పెట్టేందుకు ప్రయత్నిస్తుంటారని, వారి పట్ల కఠిన వైఖరి అవలంభిస్తామని స్పష్టం చేశారు. సరిహద్దులోనూ సైన్యం ప్రాణాలను సైతం లెక్క చేయక దేశ రక్షణ కోసం పని చేస్తున్నారని కొనియాడారు. సమాజనికి శాంతిని అందించేక్రమంలో ప్రాణాలు అర్పించిన వారిని స్ఫూర్తిగా తీసుకొని అధికారులు, సిబ్బంది పని చేయాలని సూచించారు. ముందుగా ఈ ఏడాది విధి నిర్వహణలో మరణించిన పోలీసు అధికారులకు నివాళి అర్పించారు. అనంతరం అమరవీరుల స్తూపం వద్ద జిల్లా పరిషత్‌ ఛైర్‌పర్సన్‌ స్వర్ణసుధాకర్‌, డీఎస్పీలు భాస్కర్‌, సాయిమనోహర్‌, జిల్లా జైలు పర్యవేక్షకులు డా.సంతోష్‌రాయ్‌, సీఐలు దిలీప్‌, గిరిబాబు, రాఘవరావు, రాజు, పాండురంగారెడ్డి, రాజేష్‌, రాజేశ్వర్‌గౌడ్‌, శ్రీనివాసాచారి, అశోక్‌గౌడ్‌, రాజు తదితరులు నివాళి అర్పించారు. అనంతరం ఒకటో పట్టణ పోలీసు స్టేషన్‌ వరకు ర్యాలీ నిర్వహించి, ఎస్పీ పరదేశీనాయుడు విగ్రహానికి పూలమాల వేశారు.

అమరవీరుల స్తూపం వద్ద నివాళి అర్పించడానికి పుష్పగుచ్ఛంతో వస్తున్న అదనపు ఎస్పీ వెంకటేశ్వర్లు..

ఎస్పీ పరదేశీనాయుడు

విగ్రహానికి పూలమాల వేస్తున్న జడ్పీ ఛైర్‌పర్సన్‌ స్వర్ణసుధాకర్‌.. కంటతడి పెడుతున్న పోలీసు అమరవీరుల కుటుంబ సభ్యులు

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.