close

ఆదివారం, నవంబర్ 17, 2019

ప్రధానాంశాలు

అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం
పోలీసు సంస్మరణ దినంలో ఉపముఖ్యమంత్రి బోసు
కాకినాడలో పోలీసు అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పిస్తున్న ఉపముఖ్యమంత్రి
బోస్‌, కలెక్టర్‌ మురళీధర్‌రెడ్డి, ఎస్పీ నయీం అస్మి, అమరవీరుల కుటుంబసభ్యులు

కాకినాడ కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: సమాజంలో విద్య, విజ్ఞానం పెరిగినప్పటికీ విచ్ఛిన్నకర ధోరణులు పెరగడం శోచనీయమని అవి అంతం కావాలని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, రెవెన్యూశాఖ మంత్రి పిల్లి సుభాష్‌చంద్రబోస్‌ అన్నారు. కాకినాడలోని పాత ఎస్పీ కార్యాలయంలో పోలీసు అమరవీరుల సంస్మరణ దినాన్ని జిల్లా పోలీసుశాఖ ఆధ్వర్యంలో సోమవారం ఘనంగా నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ పోలీసు అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయమన్నారు. ముందుగా పోలీసు కవాతు మైదానంలో రాష్ట్ర ఉపముఖ్యమంత్రి సుభాష్‌చంద్రబోస్‌, కలెక్టర్‌ డి.మురళీధర్‌రెడ్డి, జిల్లా ఎస్పీ అద్నాన్‌ నయీమ్‌ అస్మి పోలీసు దళాల నుంచి గౌరవ వందనాన్ని స్వీకరించారు. అనంతరం పాత ఎస్పీ కార్యాలయానికి చేరుకుని పోలీసు అమరవీరుల స్తూపం వద్ద మంత్రి బోసు, కాకినాడ పార్లమెంట్‌ సభ్యురాలు వంగా గీత, ఎమ్మెల్సీ చిక్కాల రామచంద్రరావు, ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి, కలెక్టర్‌, ఎస్పీ పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళి అర్పించారు. అనంతరం యాంటీ నక్సల్స్‌ స్కాడ్‌ బృందం వద్దకు వెళ్లి వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. పోలీసు అమరవీరుల కుటుంబాల వద్దకు వెళ్లి ఆత్మీయంగా పలకరించి దస్తులు అందజేశారు. పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 15 నుంచి 20వ తేదీ వరకు విద్యార్థులకు నిర్వహించిన వివిధ పోటీల్లో ప్రతిభకనబరిచిన వారికి బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ (పరిపాలన) ఎస్‌వీ శ్రీధరరావు, ఓఎస్డీ ఆరీఫ్‌ హఫీజ్‌, ఏఆర్‌ ఏఎస్పీ వీఎస్‌ ప్రభాకరరావు, డీఎస్పీలు సుంకర మురళీమోహన్‌, ఎం.అంబికాప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

పోలీసు అమరవీరుల స్తూపం వద్ద నివాళి అర్పిస్తున్న డీఐజీ ఖాన్‌, ఎస్పీ షిమోషి బాజ్‌పాయ్‌

కష్టం వస్తే ముందుగా స్పందించేది పోలీసులే:డీఐజీ

రాజమహేంద్రవరం నేరవార్తలు: ప్రజలకు కష్టం వస్తే ముందుగా స్పందించేది పోలీసులేనని ఏలూరు రేంజ్‌ డీఐజీ ఎఎస్‌.ఖాన్‌ పేర్కొన్నారు. సోమవారం పోలీసు అమర వీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని రాజమహేంద్రవరం జిల్లా అర్బన్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన స్మృతి పరేడ్‌లో డీఐజీ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. తొలుత అమరవీరుల స్తూపం వద్ద డీఐజీ, అర్బన్‌ ఎస్పీ షిమోషి బాజ్‌పాయ్‌ పుష్పగుచ్ఛం ఉంచి నివాళి అర్పించారు. గతేడాది ప్రమాదంలో మృతి చెందిన కానిస్టేబుల్‌ పరంజ్యోతి భార్యకు అమరవీరుల స్మృతి జ్ఞాపికను డీఐజీ అందజేశారు.అర్బన్‌ ఏఎస్పీలు కె.లలితామాధురి, వైవీ రమణ కుమార్‌, జి.మురళీకృష్ణ, డీఎస్పీలు కేవీ సత్యనారాయణ, డి.శ్రీనివాసరెడ్డి, జెవి.సంతోష్‌, వి.సత్తిరాజు, ఎస్‌.వెంకటరావు, ఏటీవీ రవికుమార్‌, వెంకటేశ్వర్లు, పి.సత్యనారాయణ, ఆర్‌.సత్యానందం పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.