close

ఆదివారం, నవంబర్ 17, 2019

ప్రధానాంశాలు

కలెక్టరేట్‌లో అరకు కాఫీ
కాఫీ స్టాల్‌ను ప్రారంభిస్తున్న కలెక్టర్‌ మురళీధర్‌రెడ్డి, చిత్రంలో జేసీ లక్ష్మీశ

కాకినాడ కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: అరకువేలీ కాఫీ (లిక్విడ్‌) స్టాల్‌ను సోమవారం కలెక్టరేట్‌లో కలెక్టర్‌ డి.మురళీధర్‌రెడ్డి, సంయుక్త కలెక్టర్‌ లక్ష్మీశతో కలిసి ప్రాంరభించారు. ప్రస్తుతం ఇక్కడ నిర్వహిస్తున్న గిరిజన ఉత్పత్తుల స్టాల్‌కు అనుబంధంగా అడ్డతీగల గిరిజన ప్రాథమిక సహకార సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ గిరిజన ఉత్పత్తుల అమ్మకాలను ప్రజలు ప్రోత్సహించాలని కోరారు. చింతూరులో అరకువేలీ కాఫీ స్టాల్‌ నిర్వహిస్తున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో డీఆర్వో సీహెచ్‌ సత్తిబాబు, రంపచోడవరం జీసీసీ డిపో మేనేజరు కె.నరసింహరాజు, అడ్డతీగల జీసీసీ మేనేజరు బి.సుబ్రమహ్మణ్యేశ్వరావు, కాఫీ మేకర్‌ ఏ.ప్రసన్నకుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.