close

శుక్రవారం, నవంబర్ 15, 2019

ప్రధానాంశాలు

104 ఉద్యోగుల ధర్నా
డీఎంహెచ్‌వో కార్యాలయం వద్ద నిరసన తెలుపుతున్న 104 ఉద్యోగులు

కాకినాడ కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: గ్రామాల్లోకి వెళ్లి ప్రజలకు వైద్య సేవలందిస్తున్న 104 వాహనాలను రాష్ట్ర ప్రభుత్వమే నిర్వహించాలని, అందులో పని చేస్తున్న సిబ్బందికి ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్‌ చేశారు. ఈ మేరకు సోమవారం జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ కార్యాలయం ఆ ఉద్యోగ సంఘం (సీఐటీయూ) ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరారు. సిబ్బందికి పది నెలలుగా రావాల్సిన టీఏ, డీఏలను వెంటనే చెల్లించాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమానికి సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి సీహెచ్‌ రాజ్‌కుమార్‌, యూనియన్‌ గౌరవాధ్యక్షురాలు ఎం.వీరలక్ష్మి, అధ్యక్షుడు త్రిమూర్తులు, కార్యదర్శి నాయుడు తదితరులు నాయకత్వం వహించారు.

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.