close

ఆదివారం, నవంబర్ 17, 2019

ప్రధానాంశాలు

అమరుల త్యాగాలు మరవలేనివి

కలెక్టర్‌ డాక్టర్‌ శరత్‌

జగిత్యాల, న్యూస్‌టుడే: అమరవీరుల త్యాగాలు మరవలేనివని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎ.శరత్‌ అన్నారు. పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రజల రక్షణ కోసం పోలీసులు దేశ రక్షణ కోసం సైనికులు చేసిన ప్రాణ త్యాగాలను స్మరించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ప్రజలు  ప్రశాంతంగా ఉన్నారంటే పోలీసులు నిద్రాహారాలు లేకుండా విధులు నిర్వహించడమేనన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అనేక సంస్కరణలు తెచ్చి పోలీసుశాఖ ప్రజలకు చేరువ చేసిందన్నారు. శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసులు చేస్తున్న కృషి వల్ల జిల్లా అనేక రంగాల్లో అభివృద్ధి చెంది రాష్ట్రంలోనే అగ్రగామిగా నిలుస్తుందని కలెక్టర్‌ అన్నారు. జిల్లా ఎస్పీ సి.హెచ్‌. సింధుశర్మ మాట్లాడుతూ.. అమరుల ఆశయసాధనకు ప్రతిఒక్కరూ కృషి చేయాలన్నారు. 1959 అక్టోబర్‌ 21న దేశరక్షణ కోసం లద్దాఖ్‌ ప్రాంతంలో ఉన్న 10 మంది భారత సైనికులను చైనా పొట్టన పెట్టుకుందని అప్పటి నుంచి దేశంలో అమరవీరుల సంస్మరణ దినోత్సవం నిర్వహిస్తున్నారన్నారు. జిల్లాలోనూ 15 మంది పోలీసులు విధి నిర్వహణలో తీవ్రవాదుల చేతుల్లో అసువులు బాసారని వారందరిని స్మరించుకోవాల్సిన అవసరముందన్నారు. శాంతిభద్రతల పరిరక్షణ కోసం ప్రాణాలర్పించిన పోలీసుకుటుంబాలకు అండగా నిలుస్తామని ఎస్పీ అన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్‌, ఎస్పీ అమరవీరుల స్తూపంపై పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళులర్పించారు. పోలీసు గౌరవవందనం స్వీకరించి అమరులకు శ్రద్ధాంజలి ఘటించారు. అదనపు ఎస్పీ నల్ల మల్లారెడ్డి, డీఎస్పీలు ఎం.వెంకటరమణ సంస్మరణ వారోత్సవాల సందర్భంగా జరిగిన వివిధ పోటీల విజేతలైన పోలీసులు, విద్యార్థిని, విద్యార్థులకు బహుమతులిచ్చారు.

రక్తదాన శిబిరం
అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా జగిత్యాల వాసవి కల్యాణ మండపంలో సోమవారం రక్తదాన శిబిరం జరిగింది. జిల్లా ఎస్పీ సింధుశర్మ, ఏఆర్‌ డీఎస్పీ ప్రతాప్‌ సహా పలువురు పోలీసులు రక్తదానం చేశారు. శిబిరాన్ని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎ.శరత్‌ ప్రారంభించగా అదనపు ఎస్పీ మల్లారెడ్డి, డీఎస్పీ వెంకటరమణ, పట్టణ సీఐ జయేష్‌రెడ్డి, సహా సీఐలు, ఎస్‌.ఐ.లు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు

తెలుగుకు జై కొట్టు.. ఆంగ్లాన్ని ఒడిసిపట్టు!

మాతృభాషలో బోధనతోనే మేధో వికాసం.. సాహితీవేత్తల మనోగతం తెలుగు అజంత భాష. అచ్చులతో అంతమయ్యే శబ్దాలు ఉండటం వల్ల ఈ పేరొచ్చింది. ఇటాలియన్‌ కూడా అజంత భాషే. దేశభాషలందు తెలుగు లెస్స అన్న శ్రీకృష్ణదేవరాయలు మాతృభాష తుళు. అయినా తాను ‘తెలుగు వల్లభుండ తెలుగొకండ’ అని గర్వంగా చెప్పుకొన్నారు. అవధాన ప్రక్రియ తెలుగు సాహిత్యానికే ప్రత్యేకం. ఇలాంటి సాహితీ చమక్కు మరే భాషలోనూ లేదు. క్రీస్తుపూర్వం 500 ఏళ్ల ముందు నుంచే తెలుగు శాసనాలు ఉన్నాయి. వెలనాటి చోడులు తెలుగును అధికార భాషగా ప్రకటించిన తొలి రాజులు. మారిషస్‌ బ్రాడ్‌కాస్టింగ్‌ కార్పొరేషన్‌ ఆధ్వర్యంలో సాగే రేడియోలో రోజూ గంటపాటు తెలుగు కార్యక్రమాలకు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.