close

మంగళవారం, నవంబర్ 12, 2019

ప్రధానాంశాలు

రీజియన్‌లో ఆర్టీసీ అద్దె బస్సులు

47 వాహనాలకు అనుమతి

ఉమ్మడి జిల్లాలో 24 రూట్ల గుర్తింపు


టెండరు బాక్సులు తెరుస్తున్న సిబ్బంది

జులైవాడ, న్యూస్‌టుడే : ఓ వైపు ఆర్టీసీ కార్మికులు తమ సమస్యలను పరిష్కరించాలని సమ్మె నిర్వహిస్తుండగా ప్రభుత్వం, ఆర్టీసీ యాజమాన్యం తమ పని తాము చేసుకుంటూ పోతున్నాయి. ఆర్టీసీ, అద్దె బస్సులను నడిపిస్తూ ప్రజా రవాణాకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసింది. వరంగల్‌ ఉమ్మడి జిల్లాలో ప్రస్తుతం ఉన్నవి కాకుండా అదనంగా మరో 47 అద్దె బస్సులను తీసుకోవడానికి యాజమాన్యం సోమవారం టెండర్లు పిలిచింది. ఈ 47 బస్సులను రీజియన్‌లోని తొమ్మిది డిపోలకు కేటాయించేందుకు అనుమతులు ఇస్తున్నారు. ఇందుకుగాను ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 24 రూట్లను గుర్తించారు. ఉద్యోగుల సమ్మె నేపథ్యంలో టెండర్ల ప్రక్రియ వేగంగా కొనసాగించారు. 15న నోటిఫికేషన్‌ ఇచ్చి, సోమవారం టెండరు ఫారాలను స్వీకరించారు. అదే రోజు సాయంత్రం ములుగు రోడ్డులోని ఆర్టీసీ జోనల్‌ శిక్షణ కళాశాలలో టెండర్లు తెరిచారు.

ఉమ్మడి జిల్లాలో గుర్తించిన రూట్లు ఇవే

భూపాల్‌పల్లి డిపో పరిధిలో భూపాలపల్లి - హైదరాబాద్‌, భూపాలపల్లి హన్మకొండ- కాళేశ్వరం, భూపాలపల్లి - గోదావరిఖని, జనగామ డిపో పరిధిలో జనగామ- హైదరాబాద్‌, జనగామ - జగద్గిరిగుట్ట, మహబూబాబాద్‌ డిపో పరిధిలో మహబూబాబాద్‌, ఖమ్మం - నర్సంపేట, హైదరాబాద్‌- నర్సంపేట, మహబూబాబాద్‌ - నర్సంపేట, హైదరాబాద్‌, మహబూబాబాద్‌- జగద్గిరిగుట్ట, మహబూబాబాద్‌ -హైదరాబాద్‌, మహబూబాబాద్‌ - సూర్యాపేట, తానంచర్ల, నర్సంపేట డిపో పరిధిలో నర్సంపేట- వేములవాడ, మహబూబాబాద్‌ - వరంగల్‌, మహబూబాబాద్‌ - తొర్రూరు, మల్లంపల్లి - ములుగు, నర్సంపేట- జంగాలపల్లి, నర్సంపేట- తొర్రూరు, తొర్రూరు డిపో పరిధిలో పాలకుర్తి - జగద్గిరిగుట్ట, తొర్రూరు - జఫర్‌గఢ్‌, హైదరాబాద్‌, తొర్రూరు - జగద్గిరిగుట్ట, తొర్రూరు, ఖమ్మం- హన్మకొండ, వరంగల్‌-2 డిపో పరిధిలో హన్మకొండ - ఏటూరునాగారం, ములుగు - పస్రా, పరకాల డిపో పరిధిలో పరకాల-హన్మకొండ, వరంగల్‌ 1 డిపో పరిధిలో హన్మకొండ- పాలకుర్తి రూట్లలో ఈ బస్సులు తిరుగుతాయి. ఆర్టీసీ నిర్ణయించిన ధరల ప్రకారం కిలోమీటరు చొప్పున డబ్బులు చెల్లిస్తారు. డ్రైవరు, బస్సు నిర్వహణ తప్ప డీజిల్‌తో పాటు భీమా ఇతర అంశాలను ఆర్టీసీనే చూసుకోనుంది.

మూడు నెలల్లో వీటిని అప్పగించాలి : అద్దె బస్సుల కోసం టెండరు దక్కించుకున్నవారు 90 రోజుల్లో ఆర్టీసీ యాజమాన్యానికి నూతన బస్సులను అప్పగించాలి. ఒక్కో వ్యక్తి ఎన్ని రూట్లలోనైనా టెండరు వేసే అవకాశం కల్పించారు. సోమవారం నిర్వహించిన టెండర్‌ ప్రక్రియలో భాగంగా రీజియన్‌లో మొత్తం 47 బస్సులు, 24 రూట్లకు గాను 2610 టెండరు ఫారాలు వచ్చాయి. లక్కీ డిప్‌ ద్వారా వారికి అధికారులు రూట్లను కేటాయించారు.

లక్కీ డిప్‌కు హాజరైన టెండరుదారులు

పారదర్శకంగా టెండర్లు నిర్వహించాం - అంచూరి శ్రీధర్‌, వరంగల్‌, రీజినల్‌ మేనేజర్‌

అద్దె బస్సుల కోసం టెండర్లు పిలిచాం. సోమవారం టెండర్లు తెరిచాం. ఉమ్మడి జిల్లాలో కొత్తగా 47 బస్సులను తీసుకుంటున్నాం. ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకుంటున్నాం. టెండరు దక్కిన వారు ఆయా రూట్లలో బస్సులను నడిపించేందుకు ఒప్పందం చేసుకుంటాం. దానికి కొంత గడువు ఉంటుంది.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.