close

మంగళవారం, నవంబర్ 19, 2019

ప్రధానాంశాలు

కశ్మీరీ శాలువాల ప్రదర్శన నేడు ప్రారంభం

కశ్మీరీ శాలువాను ప్రదర్శిస్తున్న డిజైనర్‌ వరుణా ఆనంద్‌

బంజారాహిల్స్‌, న్యూస్‌టుడే: కశ్మీరీ శాలువాల ప్రదర్శన ‘ది స్ల్పెండర్‌ ఆఫ్‌ కశ్మీర్‌’ పేరిట బంజారాహిల్స్‌లోని హోటల్‌ తాజ్‌కృష్ణలో మంగళవారం ప్రారంభం కానుందని డిజైనర్‌ వరుణా ఆనంద్‌ సోమవారం వెల్లడించారు. ప్రత్యేకంగా రూపొందించిన ‘పష్మీనా’ శాలువాలతో పాటు ఇతర శాలువాలను నగరవాసులకు అందుబాటులోకి తెస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ ప్రదర్శన మంగళ, బుధవారాల్లో కొనసాగుతుందన్నారు. కశ్మీరీ హస్త కళాకారులను ప్రోత్సహించడంతో పాటు ఆ కళకు దేశవ్యాప్తంగా ప్రాచుర్యం సాధించేందుకు ‘ది స్ల్పెండర్‌ ఆఫ్‌ కశ్మీర్‌’ పేరిట 9 ఏళ్లుగా దేశవ్యాప్తంగా ప్రదర్శనలను నిర్వహిస్తున్నట్లు ఆమె వివరించారు.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.