close

బుధవారం, నవంబర్ 13, 2019

ప్రధానాంశాలు

పోలీసు అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం

‘స్మృతి పరేడ్‌’లో ఎస్పీ సునీల్‌దత్‌

అమరవీరులకు వందనం చేస్తున్న ఎస్పీ సునీల్‌దత్‌, జేసీ వెంకటేశ్వర్లు, ఓఎస్డీ ఉదయ్‌కుమార్‌రెడ్డి

కొత్తగూడెం నేరవిభాగం, న్యూస్‌టుడే: పోలీసు అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయంగా నిలిచిపోతాయని ఎస్పీ సునీల్‌దత్‌ అన్నారు. పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా పోలీస్‌ హెడ్‌ క్వార్టర్స్‌లో స్మృతి పరేడ్‌ సోమవారం నిర్వహించారు. అనంతరం పోలీసు అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటించారు. జిల్లా సంయుక్త కలెక్టర్‌ కర్నాటి వెంకటేశ్వర్లు, అదనపు ఎస్పీ ఆపరేషన్స్‌ ఉదయ్‌ కుమార్‌ రెడ్డితో పాటు కలిసి సాయుధ బలగాల వందనాన్ని స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దేశ రక్షణలో ప్రజా సేవ చేస్తూ విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించిన పోలీసులు ఎప్పటికీ అమరవీరులుగానే మిగిలిపోతారన్నారు. వారి త్యాగాల ఫలితమే ప్రస్తుత సమాజంలో ప్రజలు ప్రశాంతంగా జీవితాన్ని గడుపుతున్నారన్నారు. వారందరి త్యాగాలను స్ఫూర్తిగా తీసుకుని పోలీసు ఉద్యోగాలను కొనసాగించాలని సిబ్బందికి సూచించారు. అమరవీరుల ఆశయాల సాధనకు ఎల్లప్పుడూ పాటుపడాలన్నారు. ప్రతీ ఏడాది ఎంతో మంది పోలీస్‌ బలగాలు దేశ రక్షణ కోసం, శాంతి, భద్రతల పరిరక్షణ కోసం సంఘ విద్రోహ శక్తుల చేతిలో అమరులవుతున్నారన్నారు. దేశ వ్యాప్తంగా ఈ ఏడాదిలో విధి నిర్వహణలో మరణించిన 292 మంది అమరవీరుల పేర్లను అడిషనల్‌ ఎస్పీ ఆపరేషన్స్‌ ఉదయ్‌కుమార్‌రెడ్డి చదివి వినిపించారు. అడ్మిన్‌ ఆర్‌.ఐ. కృష్ణ నేతృత్వంలో పోలీస్‌ అమరవీరులకు రెండు నిమిషాల పాటు మౌనం పాటించి స్మృతి పరేడ్‌ను కొనసాగించారు. ఈ కార్యక్రమంలో ఏఆర్‌ అదనపు ఎస్పీ బి. కృష్ణయ్య, బెటాలియన్‌ కమాండెంట్‌ కె.సుబ్రహ్మణ్యం, కొత్తగూడెం డీఎస్పీ డాక్టర్‌ ఎస్‌ఎం.అలీ అసిస్టెంట్‌ కమాండెంట్లు నర్సింహాస్వామి, మోర్ల శ్రీనివాస్‌రావు, మచ్చ శ్రీనివాసరావు, ఆర్‌.ఐ.లు ప్రసాద్‌, సోములు, కామరాజు, దామోదర్‌, విద్యాసాగర్‌, శివ, నర్సింహా, రాజు, శ్రీనివాస్‌, ఉదయ్‌కుమార్‌, ఆర్‌ఎస్సైలు రమణారెడ్డి, గిరిధర్‌ రెడ్డి, స్వాతి, రామకృష్ణ, గణేశ్‌, ఓం ప్రకాశ్‌, జగన్మోహన్‌రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.

పోలీసుల త్యాగాలు మరువలేనివి: మంత్రి పువ్వాడ

ఖమ్మం నగరపాలకం, న్యూస్‌టుడే: పోలీసుల త్యాగాలు మరువలేనివని రాష్ట్ర రవాణా శాఖామంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ అన్నారు. పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని సోమవారం ప్రకటన విడుదల చేశారు. ప్రజాస్వామ్య పరిరక్షణే పరమావధిగా పనిచేస్తూ ప్రాణాలర్పించిన యోధలకు ఘన నివాళులర్పించారు.

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.