close

బుధవారం, నవంబర్ 20, 2019

ప్రధానాంశాలు

17వ రోజు వంటావార్పుతో నిరసన

డిపో ఎదుట బైఠాయించిన కార్మికులు


ఉదయమే డిపో ఎదుట ధర్నా నిర్వహిస్తున్న ఆర్టీసీ కార్మికులు

మయూరిసెంటర్‌, న్యూస్‌టుడే: తమ డిమాండ్ల సాధనకు ఆర్టీసీ ఐకాస చేపట్టిన సమ్మె సోమవారానికి 17వ రోజుకు చేరుకుంది. తెల్లవారుజాము నుంచే ఆర్టీసీ ఐకాస నాయకులు డిపో వద్దకు చేరుకొని ధర్నా నిర్వహించారు. ఆర్టీసీ ఐకాస రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా డిపో ఎదుట ఆర్టీసీ కార్మికులు కొంతమంది తమ కుటుంబ సభ్యులతో కలిసి ధర్నా నిర్వహించారు. ధర్నాకు సీపీఎం, సీపీఐ, న్యూడెమోక్రసీ, భాజపా, ఎమ్మార్పీఎస్‌, తెజస, ఆమ్‌ఆద్మీ పార్టీల నాయకులు సంఘీభావం ప్రకటించారు. ఖమ్మం డిపో ఐకాస ఆధ్వర్యంలో డిపో రోడ్డులో వంటావార్పు కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్మికులు, రాజకీయ పార్టీల నాయకులు రోడ్డుకు ఇరువైపులా కూర్చొని భోజనం చేశారు. తెలంగాణ జర్నలిస్టుల ఫోరం ఆధ్వర్యంలో జర్నలిస్టులు నోటికి నల్లగుడ్డలు కట్టుకొని, నల్లజెండాలు చేబూని ఆర్‌అండ్‌బీ అతిథిగృహం నుంచి ప్రయాణ ప్రాంగణం వరకు మౌన ప్రదర్శన నిర్వహించారు.

 

తాత్కాలిక డ్రైవర్‌, కండక్టర్‌పై విచక్షణారహితంగా దాడి చేస్తున్న ఆందోళనకారులు, అడ్డుకుంటున్న పోలీసులు

 

తాత్కాలిక డ్రైవర్‌, కండక్టర్‌పై దాడి

ఆర్టీసీ కార్మికులు నిరసన ప్రదర్శన నిర్వహిస్తున్న సమయంలో ఎదురుగా వస్తున్న బస్సులో విధులు నిర్వహిస్తున్న తాత్కాలిక డ్రైవర్‌, కండక్టర్లపై ఖమ్మం డిపోరోడ్డులోని మసీదు వద్ద వారిపై ఒక్కసారిగా విచక్షణారహితంగా దాడి చేశారు. కార్మికులు చెప్పులతో కొడుతూ వారిని భయబ్రాంతులకు గురిచేశారు. వారి దగ్గరున్న బస్సు తాళాన్ని సైతం ఓ ఆందోళనకారుడు లాక్కుని తిరిగి ఇవ్వలేదు. డిపోరోడ్డులోని మోర్‌ సూపర్‌మార్కెట్‌ సమీపంలో నిలిపి ఉంచిన మరో బస్సు తాళాన్ని కూడా గుర్తుతెలియని వ్యక్తులు తీసుకొని పోవడంతో వేరే తాళం సాయంతో ఆ బస్సును డిపోకు తీసుకువచ్చారు.

రోడ్డెక్కిన 105 బస్సులు: కార్మికుల సమ్మె నేపథ్యంలో సోమవారం ఖమ్మం డిపో పరిధిలో 105 బస్సులు రోడ్డెక్కాయి. ప్రభుత్వ బస్సులు 60, ప్రైవేటు బస్సులు 45 ప్రయాణికులను వారి గమ్యస్థానాలకు చేర్చారు.


తాత్కాలిక కండక్టర్‌ చేతివాటమంటూ...

సత్తుపల్లి గ్రామీణం, న్యూస్‌టుడే: సత్తుపల్లి ఆర్టీసీ డిపోలో పని చేస్తున్న తాత్కాలిక మహిళా కండక్టర్‌ ఒకరు చేతివాటం ప్రదర్శించారంటూ ఓ వీడియో సోమవారం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. డిపోకి చెందిన బస్సు సత్తుపల్లి నుంచి విజయవాడ వెళ్లి తిరిగి వచ్చింది. సదరు కండక్టర్‌ తన వద్ద ఉన్న నగదు బ్యాగును మరో వ్యక్తికి ఇచ్చి అందులో ఉన్న నగదును లెక్కిస్తుండగా ఓ వ్యక్తి ఈ తతంగాన్ని తన చరవాణిలో చిత్రీకరించి సామాజిక మాధ్యమాల్లో ఉంచారు. టికెట్లతో నగదును పోల్చిచూడగా రూ.750 తక్కువ రావడంతో తన సోదరుడితో లెక్కిస్తుండగా కొందరు వీడియో తీసి తప్పుగా వైరల్‌ చేశారని సదరు మహిళ పేర్కొన్నారు. కార్మికులు మాత్రం కండక్టర్‌ చేతివాటం చూపేందుకే వేరొకరితో లెక్కించిందని, వాస్తవంగా టిక్కెట్ల నగదు తక్కువ వస్తే ఆర్టీసీ అధికారుల సమక్షంలో లెక్కించాలిగానీ బయటి వ్యక్తులతో లెక్కించడమేంటని నూటికి నూరు శాతం నగదును పక్కదారి పట్టించేందుకే ప్రయత్నించారని ఆరోపించారు. సమాచారం తెలుసుకున్న ఆర్టీసీ డీఎం వెంకటేశ్వరబాబు వీడియో అంశాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి ఆ సర్వీస్‌కు పని చేసిన డ్రైవర్‌, కండక్టర్‌తోపాటు వీడియోలో పక్కన ఉన్న మరో తాత్కాలిక కండక్టర్‌ను తొలగించినట్లు తెలిపారు.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.