close

శుక్రవారం, నవంబర్ 15, 2019

ప్రధానాంశాలు

హైకోర్టు ఏర్పాటుకు సంతకాల సేకరణ


ప్లకార్డులతో న్యాయవాదుల నిరసన

మూడోరోడ్డు(అనంతపురం), న్యూస్‌టుడే: రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు చేయాలని జాతీయ బార్‌ కౌన్సిల్‌ సభ్యులు రామిరెడ్డి కోరారు. మంగళవారం కోర్టు ఆవరణలో న్యాయవాదులతో సంతకాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా న్యాయవాదులు మాట్లాడుతూ సీమలో హైకోర్టు ఏర్పాటు చేయాలన్నది న్యాయమైన కోరిక అన్నారు. నెల రోజులుగా ఆందోళనలు చేస్తున్నా ప్రభుత్వం స్పందించకపోవడం సరికాదన్నారు. సీమలో హైకోర్టు ఏర్పాటు చేసేదాకా ఉద్యమాన్ని కొనసాగిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో బార్‌ అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శి నరసింహారెడ్డి, ఉపాధ్యక్షులు నాగన్న, న్యాయవాదులు రాజశేఖర్‌, వాల్మీకి గంగాధర్‌, వరప్రసాద్‌, నరసింహులు, సంజీవయ్య, నరేంద్రరెడ్డి, సోమశేఖర్‌ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.