close

గురువారం, నవంబర్ 21, 2019

ప్రధానాంశాలు

లింగ వివక్షను రూపుమాపాలి

సంయుక్త కలెక్టర్‌-2 రాజకుమారి

కాకినాడ కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: లింగ వివక్షను రూపుమాపడానికి వైద్యులు కృషి చేయాలని సంయుక్త కలెక్టర్‌-2 జి.రాజకుమారి కోరారు. జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ కార్యాలయంలో గర్భస్థ పిండ లింగ నిర్థారణ నిషేధ చట్టం-1994పై ప్రభుత్వ, ప్రైవేటు గైనకాలజిస్టులు, రేడియోలజిస్టులు, స్కానింగ్‌ కేంద్రాల నిర్వాహకులకు మంగళవారం కార్యశాల నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ స్కానింగ్‌ కేంద్రాల నిర్వాహకులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. రిసోర్స్‌పర్సన్‌ డాక్టర్‌ రవికిరణ్‌వర్మ ఈ చట్టం గురించి వివరించారు. డీఎంహెచ్‌వో బి.సత్యసుశీల, ఏడీఎంహెచ్‌వో రమేష్‌, జిల్లా క్షయ నియంత్రణ అధికారి ప్రసన్నకుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.