close

మంగళవారం, నవంబర్ 19, 2019

ప్రధానాంశాలు

న్యాక్‌కు అసోచామ్‌ నేషనల్‌ లీడర్‌షిప్‌ ఎక్స్‌లెన్స్‌ అవార్డు

రోడ్డు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అభినందనలు

మాదాపూర్‌ న్యూస్‌టుడే: మాదాపూర్‌లోని నేషనల్‌ అకాడమీ ఆఫ్‌ కన్‌స్ట్రక్షన్‌(న్యాక్‌)కు అసోసియేట్‌ ఆఫ్‌ ఛాంబర్స్‌ ఆఫ్‌ కామర్స్‌ ఆఫ్‌ ఇండియా(అసోచామ్‌) నేషనల్‌ లీడర్‌షిప్‌ ఎక్స్‌లెన్స్‌ అవార్డు దక్కింది. నిర్మాణ రంగంలో నిరుద్యోగ యువతకు వృత్తి శిక్షణ అందిస్తూ ఉపాధి కల్పిస్తున్నందుకుగానూ న్యాక్‌ను ఈ అవార్డు వరించింది. ఇటీవల పట్నా నగరంలో జరిగిన ఓ కార్యక్రమంలో న్యాక్‌ ప్రతినిధులు ఈ అవార్డును అందుకున్నారు. మంగళవారం రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి న్యాక్‌ డైరెక్టర్‌ జనరల్‌ కె.భిక్షపతితోపాటు న్యాక్‌ బృందాన్ని ఈ సందర్భంగా అభినందించారు.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.