close

శుక్రవారం, నవంబర్ 22, 2019

ప్రధానాంశాలు

జేబీఎస్‌-ఎంజీబీఎస్‌ మెట్రో పురోగతి

ఈనాడు, హైదరాబాద్‌: మెట్రోరైలు కారిడార్‌-2 జేబీఎస్‌ నుంచి ఎంజీబీఎస్‌ మార్గంలోని మిగిలిన రెండు మెట్రో స్టేషన్లలో విద్యుదీకరణకు మార్గం సుగమమైంది. ఈ మార్గంలోని నారాయణగూడ, సుల్తాన్‌బజార్‌ మెట్రో స్టేషన్లలో ఏర్పాటు చేసిన 33కేవీ/415వీ ఇండోర్‌ సబ్‌స్టేషన్లను కేంద్ర ప్రభుత్వ చీఫ్‌ ఎలక్ట్రికల్‌ ఇన్‌స్పెక్టర్‌ (సీఈఐజీ) డి.వి.ఎస్‌.రాజు మంగళవారం పరీక్షించారు. మెట్రో నడిచేందుకు ఉపయోగించే ఓవర్‌హెడ్‌ విద్యుత్తు ట్రాక్షన్‌ లైన్‌ను చీఫ్‌ ఎలక్ట్రికల్‌ ఇన్‌స్పెక్టర్‌ తనిఖీ చేసి అనుమతిస్తారు. ఈ ప్రక్రియ నవంబరు నాటికి పూర్తవుతుందని మెట్రో ఇంజినీర్ల అంచనా. అనంతరం టెస్ట్‌, ట్రయల్‌రన్‌ చేపడతారు. డిసెంబరు ఆఖరుకల్లా అందుబాటులోకి తెచ్చి ప్రారంభించాలన్నది ప్రణాళిక.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.