శుక్రవారం, డిసెంబర్ 06, 2019
సుబేదారి, న్యూస్‌టుడే: తెలంగాణ ముఖ్యమంత్రి ఆర్టీసీ కార్మికుల పట్ల వివక్ష చూపిస్తున్నారని భాజపా రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి కృష్ణసాగర్‌రావు అన్నారు. శుక్రవారం అర్బన్ భాజపా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి కోర్టులకు, ప్రజలకు అవాస్తవాలు చెబుతున్నారని ఆరోపించారు. ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని గత నెల రోజుల నుంచి సమ్మె చేస్తున్నప్పటికీ ముఖ్యమంత్రి స్పందించడం లేదన్నారు. రాష్ట్రంలో రాజకీయ సంక్షోభం ఏర్పడే ప్రమాదం ఉందన్నారు. ముఖ్యమంత్రి లాంటి వ్యక్తి రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడే విధంగా ప్రవర్తించడం శోచనీయమన్నారు. ఆర్టీసీ అస్తులను కాజేసేందుకు కేసీఆర్ ప్రణాళికతో ఆర్టీసీ కార్మికులపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారన్నారు. ఎంవీఐ యాక్టు ప్రకారం ఆర్టీసీని ప్రైవేటుపరం చేస్తామని కేసీఆర్ చెబుతున్నారని, ఆచట్టంలో అలాంటి ప్రస్తావన లేదన్నారు. మిగులు బడ్జెట్ రాష్ట్రంగా ఉన్న తెలంగాణను అప్పులమయంగా మార్చారన్నారు. ప్రాజెక్టులపై ఖర్చైన నిధుల వివరాలను సైతం కూడా ఇవ్వడం లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వ వ్యవహారశైలిపై గవర్నర్, రాష్ట్రపతికి భాజపా ఫిర్యాదు చేస్తోందన్నారు. విలేకరుల సమావేశంలో భాజపా అర్బన్ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ, డాక్టర్ విజయలక్ష్మి, శ్రీనివాస్, రాజేంద్రప్రసాద్, వంశీ, చొల్లేటి కృష్ణమాచారి తదితరులు పాల్గొన్నారు.
సంపత్‌కుమార్‌ను అభినందిస్తున్న పీఆర్ ఉద్యోగ సంఘాల నాయకులు
బాధ్యతలు చేపట్టిన ఇన్‌ఛార్జి పీఆర్ ఎస్ఈ
జిల్లాపరిషత్, న్యూస్‌టుడే: ఉమ్మడి వరంగల్ జిల్లా పంచాయతీరాజ్ ఇన్‌ఛార్జి పర్యవేక్షక ఇంజినీరుగా శుక్రవారం వరంగల్ అర్బన్ ఈఈ సంపత్‌కుమార్ బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతం ఇక్కడ పనిచేస్తున్న ఎస్ఈ సత్యనారాయణ గురువారం పదవీ విరమణ పొందారు. ఆయన స్థానంలో ఈఈ సంపత్‌కుమార్‌కు బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. బాధ్యతలు చేపట్టిన తర్వాత పంచాయతీరాజ్ ఉద్యోగ సంఘాల నాయకులు పులి ప్రభాకర్, చంద్రశేఖర్, జయశంకర్, శ్రీనివాస్, భిక్షపతి, సాంబశివరావు, ప్రసన్న లక్ష్మి ఇన్చార్జి ఎస్ఈని సన్మానించారు.
తాజా వార్తలు
జిల్లా వార్తలు