close

శుక్రవారం, డిసెంబర్ 06, 2019

ప్రధానాంశాలు

రెవెన్యూ ఉద్యోగుల నిరసన
ఎల్లారెడ్డిలో నిరసన వ్యక్తం చేస్తున్న రెవెన్యూ ఉద్యోగులు

ఎల్లారెడ్డి, న్యూస్‌టుడే: రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్‌ తహసీల్దార్‌ విజయను హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని తహసీల్దార్‌ మహిపాల్‌ అన్నారు. విధులు బహిష్కరించి ఎల్లారెడ్డి తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. ఉద్యోగభద్రత లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.

సదాశివనగర్‌ : అబ్దుల్లాపూర్‌మెట్‌ సంఘటనకు నిరసనగా సదాశివనగర్‌ ఎంపీడీవో కార్యాలయం ఎదుట సోమవారం ఉద్యోగులు నిరసన వ్యక్తం చేశారు. విజయ మృతికి సంతాపం తెలిపారు. కార్యక్రమంలో ఎంపీడీవో అశోక్‌, ఎంపీవో సతీష్‌కుమార్‌, ఉద్యోగులు సూర్యాజీరావు, శ్రీధర్‌, రాజేందర్‌ తదితరులు పాల్గొన్నారు.

గాంధారి: అబ్దుల్లాపూర్‌మెట్‌ తహసీల్దార్‌ విజయను సజీవ దహనం చేసిన సంఘటనను నిరసిస్తూ గాంధారి రెవెన్యూ కార్యాలయం సిబ్బంది విధులను బహిష్కరించారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ లత, డీటీ సంగమేశ్వర్‌, ఆర్‌ఐ నరసింహారెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.