close

ఆదివారం, జనవరి 19, 2020

ప్రధానాంశాలు

ధర్మభిక్షం చరిత్రను పాఠ్యాంశంలో చేర్చాలి

వైభవంగా కంఠమహేశ్వరస్వామి కల్యాణం


నారాయణపురంలో కంఠమహేశ్వరస్వామి-సురమాంభదేవి కల్యాణంలో ఎక్సైజ్‌శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌,

ప్రభుత్వ విప్‌ కర్నె ప్రభాకర్‌, మాజీ ఎంపీ నర్సయ్యగౌడ్‌

సంస్థాన్‌ నారాయణపురం, న్యూస్‌టుడే: మాజీ ఎంపీ బొమ్మగోని ధర్మబిక్షం నీతి, నిజాయితీకి ఆదర్శనీయుడనీ అతని జీవిత చరిత్రను పాఠ్యాంశంలో చేర్చాలని రాష్ట్ర ఎక్సైజ్‌శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు. సంస్థాన్‌ నారాయణపురం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన ధర్మభిక్షం విగ్రహాన్ని ఆయన శాసన మండలి విప్‌ కర్నె ప్రభాకర్‌తో కలిసి శుక్రవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. అనాడు సర్వాయి సర్దార్‌ పాపన్న అన్ని జాతుల కోసం రాజ్యాన్ని స్థాపించిస్తే ఈనాడు అంతకంటే ఎక్కువ ప్రజాభిమానంతో ధర్మబిక్షం ప్రజల గుండెల్లో కొలువై ఉన్నాడని అన్నారు. కల్లుగీత కార్మికులకు పింఛను, ఎక్స్‌గ్రేషియా సాధించిన ఘనత ధర్మభిక్షందే అన్నారు. భారత ప్రభుత్వం గుర్తించి ఆయనకు భారతరత్న ప్రకటించాలన్నారు. శాసన మండలి విప్‌ కర్నె ప్రభాకర్‌ మాట్లాడుతూ అత్యున్నతమైన చట్టసభలకు ఎంపికై సాధారణ జీవితం గడిపిన ఏకైక వ్యక్తి ధర్మభిక్షం అన్నారు. ఎన్నో ప్రజా ఉద్యమాలు సాధించిన ఆయన పేరును ఈ ప్రాంతంలో ఎదోఒక ప్రాజెక్టుకు పెట్టే విధంగా కృషి చేస్తానని అన్నారు. అనంతరం మండల కేంద్రంలో శ్రీ కంఠమహేశ్వరస్వావి జాతర ఉత్సవాలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. కంఠమహేశ్వరస్వామి- సురమాంభ కల్యాణ మహోత్సవాన్ని తిలకించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్‌, మాజీ ఎమ్మెల్యేలు కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, ఉజ్జిని యాదగిరిరావు, బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్‌, గీత సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ప్రభాకర్‌, జర్నలిస్టు ఫోరం రాష్ట్ర ఉపాధ్యక్షుడు పల్లె రవికుమార్‌, సుద్దగాని హరిశంకర్‌, ఎంపీపీ గుత్తా ఉమాదేవి, జడ్పీటీసీ సభ్యురాలు వీరమల్ల భానుమతి, సర్పంచి శ్రీహరి, యాదగిరి, సతీష్‌, గాలయ్య, యాదయ్య, సత్తయ్య, శ్రీరాములు, బద్దం యాదయ్య ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు, కంఠమహేశ్వరస్వామి దేవాలయం కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.