close

ఆదివారం, డిసెంబర్ 08, 2019

ప్రధానాంశాలు

కేంద్రం కార్పొరేట్‌కు వత్తాసు

ఇబ్బంది పడుతున్న సామాన్య ప్రజలు

కలెక్టరేటు ఎదుట ధర్నాలో కాంగ్రెస్‌ నేతలు

ఇందూరు సిటీ, న్యూస్‌టుడే

కలెక్టరేట్‌ వద్ద ధర్నాలో మాట్లాడుతున్న మాజీ మంత్రి సుదర్శన్‌ రెడ్డి,

ప్రధాని మోదీ ఏ నిర్ణయం తీసుకొన్నా అది కార్పొరేట్‌ సంస్థలకు మేలు చేసేలా ఉంటోందని ఏఐసీసీ కార్యదర్శి శ్రీనివాసన్‌ కృష్ణన్‌ అన్నారు. నోట్ల రద్దు జరిగి మూడేళ్లు గడిచినా సామాన్య ప్రజానీకం ఇప్పటికీ ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. దేశంలో నెలకొన్న ఆర్థికమాంద్యానికి వ్యతిరేకంగా నిజామాబాద్‌లో కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం కలెక్టరేట్‌ వద్ద ధర్నా చేశారు. డీసీసీ అధ్యక్షుడు మానాల మోహన్‌ రెడ్డి అధ్యక్షత వహించారు. శ్రీనివాసన్‌ కృష్ణన్‌ మాట్లాడుతూ.. పెద్దనోట్ల రద్దుతో నల్లధనం వెలికితీస్తామని అప్పట్లో కేంద్రం ప్రకటించిందన్నారు. ఇప్పటివరకు ఎంత మొత్తంలో నల్లధనాన్ని వెలికితీశారన్నది ప్రజలకు బహిర్గతం చేయాలన్నారు. నోట్ల రద్దుతో బడా కంపెనీలు, వ్యాపారులకు మేలు చేకూర్చారని విమర్శించారు.

మాజీ మంత్రి సుదర్శన్‌ రెడ్డి మాట్లాడుతూ..రాష్ట్రంలోనూ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా కుదేలైందన్నారు. ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలతో ప్రజలపై భారం పడుతోందన్నారు. కాళేశ్వరం నీళ్లను నిజాంసాగర్‌కు తీసుకొస్తామని అప్పట్లో పోచారం శ్రీనివాస్‌రెడ్డి హామీ ఇచ్చారని, ఇప్పటి వరకు చుక్క నీరు కూడా రాలేదని ఎద్దేవా చేశారు. డీసీసీ అధ్యక్షుడు మానాల మోహన్‌ రెడ్డి మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలతో సామాన్య ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. ఈ ధర్నాలో మాజీ విప్‌ ఈరవత్రి అనిల్‌, టీపీసీసీ ప్రధాన కార్యదర్శులు మహేష్‌ కుమార్‌ గౌడ్‌, గడుగు గంగాధర్‌, మాజీ ఎమ్మెల్సీ భూపతి రెడ్డి, విద్యాసాగర్‌ రావు, తాహెర్‌ బిన్‌ హందాన్‌, ప్రేమలత అగర్వాల్‌, కేశ వేణు, గంగారెడ్డి, పంచరెడ్డి చరణ్‌ తదితరులు పాల్గొన్నారు

డీసీసీ అధ్యక్షుడు మానాల మోహన్‌రెడ్డిని అరెస్టు చేసి తీసుకెళ్తున్న పోలీసులు

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.