శుక్రవారం, డిసెంబర్ 06, 2019
కొండుపల్లె(ఉయ్యాలవాడ), న్యూస్టుడే: పారదర్శకంగా విధులు నిర్వహించి విద్యార్థుల జీవితాల్లో విజ్ఞాన జ్యోతి వెలిగించిన ఉపాధ్యాయుడు ఆర్.వి.మౌళీశ్వరరెడ్డి పదవీ విరమణ పొందినా బోధించడానికి పాఠశాలకు వస్తున్నారు. ఈయన ఉయ్యాలవాడ మండల పరిధిలోని కొండుపల్లి ఉన్నత పాఠశాలలో సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడిగా మౌళీశ్వరరెడ్డి మూడేళ్లు విధులు నిర్వహించి, 2019 ఆగస్టు 31వ తేదీన పదవీవిరమణ పొందారు. సెప్టెంబర్ 1వ తేదీ నుంచి విశ్రాంత ఉపాధ్యాయుడిగా కొనసాగాల్సిన మౌళీశ్వరరెడ్డి బోధించడానికి ముందుకు వచ్చారు. పైసా ఆశించకుండా 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు సాంఘిక శాస్త్రం బోధిస్తున్నారు. రోజూ 3.30 గంటల పాటు వివిధ తరగతుల విద్యార్థులకు బోధిస్తున్నారు.
పిల్లల క్షేమం కోరి
- ఆర్వి.మౌళీశ్వరరెడ్డి విశ్రాంత ఉపాధ్యాయుడు
నేను లేకపోతే విద్యార్థులకు సాంఘిక శాస్త్రం బోధించడానికి పాఠశాలలో ఉపాధ్యాయులు లేరు. ఇప్పటికే జీవశాస్త్రం బోధించే ఉపాధ్యాయులు కూడా లేరు. నేను కూడా రాకపోతే విద్యార్థులు పూర్తిగా నష్టపోతారు. అందుకే పైసా ఆశించకుండా ఆళ్లగడ్డ నుంచి కొండుపల్లెలోని పాఠశాలకు సొంత ఖర్చుతో వచ్చి బోధిస్తున్నాను. ఎమ్మెస్సీ, బీఈడీ చదివి ఖాళీగా ఉన్న నా కుమార్తెను కూడా జీవశాస్త్రం బోధించడానికి పాఠశాలకు తీసుకువస్తున్నాను. కుమార్తెతో కలిసి ఉచితంగా బోధించడం అదృష్టంగా భావిస్తున్నాను.
తాజా వార్తలు
జిల్లా వార్తలు