close

ఆదివారం, డిసెంబర్ 15, 2019

ప్రధానాంశాలు

నిరసనలు.. అరెస్టులు

 ఆర్టీసీ సమ్మెకు అఖిలపక్షం మద్దతు
 మంత్రి ఇంటి ముట్టడికి ప్రయత్నం

కరీంనగర్‌ రవాణా విభాగం, న్యూస్‌టుడే : నిరసనలు, ర్యాలీలు, అరెస్ట్‌లతో ఆర్టీసీ కార్మికుల సమ్మె 37వ రోజు కొనసాగింది. కరీంనగర్‌ రీజియన్‌లో సోమవారం ఆర్టీసీ ఐకాస ఆధ్వర్యంలో మంత్రుల, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధుల ఇళ్లు వద్ద నిరసనలు, ముట్టడికి ప్రయత్నించగా పోలీసులు అరెస్ట్‌ చేశారు. సమ్మెకు అఖిలపక్ష, వివిధ సంఘాలు మద్దతు ప్రకటించాయి. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని పలువురు డిమాండ్‌ చేశారు. కరీంనగర్‌లో ఆర్టీసీ కార్మికులు, వామపక్షాల ఆధ్వర్యంలో మంత్రి గంగుల కమలాకర్‌ ఇంటి వద్ద నిరసన తెలపడానికి బస్టాండ్‌ నుంచి ర్యాలీగా వెళ్లడానికి ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఆందోళనకారులను అరెస్ట్‌ చేసి ఠాణాకు తరలించారు. సీపీయం జిల్లా కార్యదర్శి గీట్ల ముకుందరెడ్డి, ఐకాస నాయకుడు జక్కుల మల్లేశం గౌడ్‌ మాట్లాడుతూ 37 రోజులుగా కార్మికులు సమ్మె చేస్తుంటే ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, శాంతియుతంగా నిరసన తెలుపుతామంటే పోలీసులు అడ్డుకున్నారని ఆరోపించారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి సృజన్‌కుమార్‌, నాయకులు బండారి శేఖర్‌, టి.ఆర్‌.రెడ్డి, రమేశ్‌, శ్రీకాంత్‌ తదితరులు పాల్గొన్నారు. సమ్మెకు మద్దతుగా తెదేపా ఆధ్వర్యంలో బస్టాండ్‌ నుంచి ఆర్టీసీ వర్క్‌షాపు వరకు ద్విచక్ర వాహనర్యాలీ నిర్వహించారు. వర్క్‌షాపు ఆవరణలో వంటా వార్పు నిర్వహించారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు అంబటి జోజిరెడ్డి మాట్లాడుతూ ఆర్టీసీ కార్మికులు తమ డిమాండ్లు పరిష్కరించాలని కోరితే, ఆర్టీసీ ఉండదని, ప్రైవేట్‌పరం చేస్తామంటూ బెదిరించేలా మాట్లాడటం సరైందికాదన్నారు. సమ్మెకు కాంగ్రెస్‌ ఎస్సీసెల్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎర్ర శ్రీనివాస్‌ సంఘీభావం ప్రకటించారు. కార్యక్రమంలో ఐకాస, వివిధ సంఘాల నాయకులు జక్కుల మల్లేశంగౌడ్‌, టి.ఆర్‌.రెడ్డి, ఎన్‌.కె.రాజు, గుర్రాల రవీందర్‌, రజనీకాంత్‌, రామచంద్రం, తెదేపా నాయకులు కళ్యాడపు ఆగయ్య, రవీందర్‌, బాలాగౌడ్‌ తదితరులు పాల్గొన్నారు. సమ్మె నేపథ్యంలో ఆర్టీసీ ప్రయాణికుల సౌకర్యార్థం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసింది. కరీంనగర్‌ రీజియన్‌లో పది డిపోల పరిధిలో సోమవారం 667 బస్సులు నడిపింది. 473 ఆర్టీసీ, 194 అద్దె బస్సులు ఉన్నట్లు ఆర్టీసీ ఆర్‌ఎం జీవన్‌ ప్రసాద్‌ తెలిపారు.

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.