close

గురువారం, డిసెంబర్ 05, 2019

ప్రధానాంశాలు

ముగిసిన ఒంగోలు జాతి ఎడ్ల పందాలు

ప్రథమ స్థానం పొందిన ఎడ్ల యజమానికి బహుమతి ప్రదానం చేస్తున్న ఎమ్మెల్యే

నేలకొండపల్లి, న్యూస్‌టుడే: ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం రాజేశ్వరపురంలో కార్తిక పౌర్ణమి సందర్భంగా నిర్వహిస్తున్న ఉమ్మడి ఆంద్రప్రదేశ్‌ రాష్ట్ర స్థాయి ఒంగోలు జాతి ఎడ్ల పందాలు మంగళవారంతో ముగిశాయి. జూనియర్‌ ఎడ్ల విభాగంలో పోటీలు నిర్వహించగా తెలుగు రాష్ట్రాల నుంచి ఎనిమిది ఎడ్ల జతలు పోటీ పడ్డాయి. వీటిలో గుంటూరు జిల్లా నుంచి రెండు జతలు, సూర్యాపేట, ప్రకాశం, ఖమ్మం జిల్లాల నుంచి ఒక్కో జత, కృష్ణా జిల్లా నుంచి మూడు జతల ఎడ్లు పాల్గొన్నాయి. ఈ పోటీల్లో కృష్ణా జిల్లా పెనమలూరుకు చెందిన దేవభక్తుని సుబ్బారావు ఎడ్లజత ప్రథమ స్థానంలో నిలిచింది. విజయవాడకు చెందిన మేకా కృష్ణమోహన్‌ ఎడ్ల జత ద్వితీయ స్థానంలో నిలిచాయి. పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్‌రెడ్డి ప్రథమ విజేతకు రూ.40 వేలు, ద్వితీయ విజేతకు రూ.30 వేలు నగదు బహుమతిని అందజేశారు. కార్యక్రమంలో జడ్పీ ఉపాధ్యక్షురాలు మరికంటి ధనలక్ష్మి, ఎంపీపీ వజ్జా రమ్య, తిరుమలాయపాలెం ఎంపీపీ మంగీలాల్‌, సర్పంచి దండా పుల్లయ్య, సహకార సంఘం అధ్యక్షుడు దండా ప్రవీణ్‌, ఎంపీటీసీ సభ్యురాలు చంద్రమ్మ, తెరాస నాయకులు నారాయణరావు, బ్రహ్మయ్య, నిర్వాహక కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

ప్రజలనుద్దేశించి మాట్లాడుతున్న మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

ఆప్యాయతకు ధన్యుడిని : తుమ్మల

పాలేరు నియోజకవర్గ ప్రజల ఆప్యాయతకు ధన్యుడనయ్యాయని మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వ్యాఖ్యానించారు. ఎడ్ల పందాల పోటీలకు ఆయన హాజరు కాగా గువ్వలగూడెం నుంచే ఘన స్వాగతం పలికారు. తుమ్మల రాకను తెలుసుకున్న తెరాస కార్యకర్తలు, అభిమానులు భారీగా హాజరయ్యారు. అనంతరం పోటీలను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ పాలేరు ప్రజలకు కావాల్సిన పనులన్నీ చేసి పెట్టానని తెలిపారు. నాపై నమ్మకం ఉంచి రెండున్నరేళ్లు అభివృద్ధి బాధ్యతలను అప్పగించారని, నా శక్తివంచన లేకుండా పనిచేశానన్నారు. గ్రామంలో జరుగుతున్న ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించటం నాపై ఉన్న అభిమానాన్ని తెలుపుతుందన్నారు. తుమ్మల వెంట ఖమ్మం నగర మేయర్‌ పాపాలాల్‌, మువ్వా విజయ్‌బాబు, శాఖమూరి రమేష్‌, కె.నాగేశ్వరరావు, ఎన్‌.వెంకటేశ్వర్లు తదితరులు ఉన్నారు.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.