close

సోమవారం, డిసెంబర్ 09, 2019

ప్రధానాంశాలు

కళల కాణాచిగా విరాజిల్లుతున్న మధిర

ప్రారంభమైన జాతీయస్థాయి బాలోత్సవ్‌

కూచిపూడి నృత్యం చేస్తున్న చిన్నారి

మధిర పట్టణం, న్యూస్‌టుడే: ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనే మధిర ప్రాంతం కళల కాణాచిగా విరాజిల్లుతోందని రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ ఛైర్మన్‌ కొండబాల కోటేశ్వరరావు, ఖమ్మం జిల్లా పరిషత్‌ ఛైర్మన్‌ లింగాల కమల్‌రాజు పేర్కొన్నారు. రామభక్త సీతయ్య కళా పరిషత్‌ ఆధ్వర్యంలో జాతీయ స్థాయిలో నిర్వహిస్తున్న మధిర బాలోత్సవ్‌ మంగళవారం వైభవంగా ప్రారంభమయింది. ముందుగా స్థానిక శ్రీలక్ష్మీ పద్మావతి సమేత శ్రీవేంకటేశ్వర కల్యాణ మండపం ప్రాంగణంలో ‘2019-మధిర బాలోత్సవ్‌’ కార్యక్రమాన్ని వారు జ్యోతి వెలిగించి ప్రారంభించారు. ప్రారంభ సభలో మాట్లాడుతూ.. నైజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన వీరోచిత చరిత్రతో పాటే ప్రాచీన సంప్రదాయ కళల పరిరక్షణకు మధిర ప్రాంతం ముందుండి నడుస్తుండటం అభినందనీయమన్నారు. సాంస్కృతిక, సంప్రదాయ, పౌరాణిక రంగస్థల కళలకు ఈ ప్రాంతం పెట్టింది పేరుగా నిలుస్తోందని ప్రశంసించారు. కళా పరిషత్‌ అధ్యక్ష, కార్యదర్శులు పుతుంబాక శ్రీకృష్ణప్రసాద్‌, బాబ్లా అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో లయన్స్‌క్లబ్‌ జోనల్‌ ఛైర్మన్‌ మల్లాది వాసు, ఆత్మ కమిటీ ఛైర్మన్‌ రంగిశెట్టి కోటేశ్వరరావు, తెరాస నాయకులు రావూరి శ్రీనివాసరావు, భరత్‌ విద్యా సంస్థల అధినేత శీలం వెంకటరెడ్డి, విశ్రాంత ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు పారుపల్లి కృష్ణారావు, ఆలయ కమిటీ అధ్యక్షుడు గంగవరపు వీరారెడ్డి, టీవీ రెడ్డి, కళ్యాణం పుల్లారావు, మాటూరుపేట శ్రీసీతారామాంజనేయ కళా పరిషత్‌ అధ్యక్షుడు గడ్డం సుబ్బారావు పాల్గొన్నారు.


సినీ గేయానికి నృత్యం చేస్తున్న చిన్నారులు

చిరుమువ్వల సవ్వడి

తొలిరోజు చిన్నారుల ప్రదర్శనలో వేదిక దద్దరిల్లింది. జానపద, బృంద నృత్యాలతో చిన్నారులు ఆకట్టుకున్నారు. తొలిరోజు శాస్త్రీయ, జానపద నృత్యాలు సీనియర్‌, జూనియర్‌ విభాగాల్లో నిర్వహించారు. రెండోరోజు బుధవారం నీ సత్తా చాటుకో, నీతి పద్యాలు, ఏకపాత్రాభినయాలు, విచిత్ర వేషధారణలు, జానపద పాటల పోటీలు, మూడోరోజు సీనియర్‌, జూనియర్‌ విభాగాల్లో నాటికల పోటీలు నిర్వహించనున్నారు. చిన్నారుల నృత్యాలను తిలకించేందుకు మధిర పరిసర ప్రాంతాలకు చెందిన కళాభిమానులతో ప్రాంగణం నిండిపోయింది. చిన్నారుల ప్రతిభా పాటవాలకు చప్పట్లు, ఈలలతో బాలోత్సవ్‌ ప్రాంగణం హోరెత్తిపోయింది.

జ్యోతి వెలిగించి బాలోత్సవ్‌ను ప్రారంభిస్తున్న కొండబాల, కమల్‌రాజు తదితరులు

జానపద బృంద నృత్యంతో సందడి చేస్తున్న చిన్నారులు

ఆకట్టుకునే నృత్యంతో అలరిస్తున్న చిన్నారి కళాకారులు

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.