సోమవారం, డిసెంబర్ 16, 2019
కర్నూలు విద్య, న్యూస్టుడే: 2019-20 విద్యా సంవత్సరానికి సంబంధించి సుస్థిర అభివృద్ధికి శాస్త్ర సాంకేతికత ప్రధాన అంశంగా 6-10వ తరగతి విద్యార్థులకు ఈనెల 27,28 తేదీల్లో జరిగే జిల్లాస్థాయి వైజ్ఞానిక ప్రదర్శనలకు ఆహ్వానిస్తున్నామని జిల్లా విద్యాధికారి సాయిరామ్ ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాస్థాయి ప్రదర్శనను నంద్యాలలోని గురురాజ పాఠశాలలో ఏర్పాటు చేస్తున్నామన్నారు. సుస్థిర వ్యవసాయం అభ్యాసాలు, పరిశుభ్రత-ఆరోగ్యం, వనరుల నిర్వహణ, పారిశ్రామిక అభివృద్ధి, భవిష్యత్తు రవాణా-సమాచారం, విద్యాపరమైన ఆటలు గణిత నమూనాలు ఉపాంశాలపై ప్రదర్శన జరుగుతుందన్నారు. ఒక విద్యార్థి సహాయకులు(గైడ్ టీచర్) పాల్గొనాలని, ఇందులో వ్యక్తిగత ప్రదర్శన, జట్టు, ఉపాధ్యాయ ప్రదర్శన ఉంటుందన్నారు. జిల్లాలోని అన్ని యాజమాన్యాలకు చెందిన విద్యార్థులు ప్రదర్శించవచ్చన్నారు.
తాజా వార్తలు
జిల్లా వార్తలు