న్యాయవాదుల సహకారం మరువలేనిదిజిల్లా ప్రధాన న్యాయమూర్తి సుబ్రహ్మణ్యం

జిల్లా ప్రధాన న్యాయమూర్తిని సన్మానిస్తున్న న్యాయవాదులు
మహబూబ్‌నగర్ (న్యాయవిభాగం), న్యూస్‌టుడే : జిల్లాలో పని చేసిన సమయంలో న్యాయవాదులు అందించిన సహకారం మరువలేనిదని జిల్లా ప్రధాన న్యాయమూర్తి సుబ్రహ్మణ్యం అన్నారు. బదిలీపై వెళ్తున్న ఆయనను బుధవారం బార్ అసోసియేషన్ కార్యాలయంలో న్యాయవాదులు సన్మానించారు. ఈ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ ఇక్కడి నుంచి బదిలీపై వెళ్లేందుకు ఇష్టం లేకపోయినప్పటికి తప్పనిసరి పరిస్థితుల్లో వెళ్తున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు అనంతరెడ్డి, మురళీకృష్ణ, ఉపాధ్యక్షుడు రాజభాస్కర్, న్యాయవాదులు మనోహర్‌రెడ్డి, పుల్లయ్య, ప్రతాప్‌కుమార్, పీపీ బాలగంగాధర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.