close

శనివారం, డిసెంబర్ 07, 2019

ప్రధానాంశాలు

కూచిపూడిలో జాతీయస్థాయికి..

న్యూస్‌టుడే, వనపర్తి పట్టణం

నపర్తి జిల్లా కేంద్రానికి చెందిన విద్యార్థిని చైత్రారెడ్డి కూచిపూడి నృత్యంలో రాణిస్తోంది. పలు జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిల్లో జరిగిన ఎన్నో వేదికలపై చైత్రారెడ్డి తనదైన శైలిలో కూచిపూడి నృత్యం చేసి పలువురు ప్రముఖులతో సన్మానాలు, బహుమతులు, ప్రశంసలందుకుని స్ఫూర్తిగా నిలుస్తోంది. విద్యాశాఖ ఆధ్వర్యంలో ఈనెల 11న హైదరాబాదులోని పబ్లిక్‌ గార్డెన్స్‌లో నిర్వహించిన రాష్ట్రస్థాయి కళా ఉత్సవ్‌ పోటీల్లో కూచిపూడి నృత్య విభాగంలో ప్రథమ స్థానంలో నిలిచి జాతీయస్థాయికి ఎంపికైంది.

వనపర్తి జిల్లా కేంద్రంలో ఆగస్టు 15 సందర్భంగా నిర్వహించిన జిల్లాస్థాయి వైజ్ఞానిక ప్రదర్శన పోటీల్లో మదనాపురానికి చెందిన ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులు ప్రదర్శించిన ప్రయోగం పలువురి ప్రశంసలందుకుంది. ఈ పోటీల్లో పాఠశాలకు చెందిన విద్యార్థులు హరీష్‌, మనోహర్‌ రూపొందించిన చంద్రయాన్‌ ప్రయోగం నమూనా చూపరులను ఆకట్టుకుంది. రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, జిల్లా పాలనాధికారిణి శ్వేతా మహంతి ఈ ప్రయోగాన్ని ప్రదర్శించిన విద్యార్థులను ప్రత్యేకంగా అభినందించారు.

మురుగు శుభ్రపరిచే యంత్ర ప్రయోగం..

మదనాపురం ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థిని రెహనాబేగం మురుగు నీటిని శుభ్రపరిచే అధునాతన యంత్రం ప్రయోగ ప్రదర్శన ఆకట్టుకుంది. జిల్లాస్థాయిలో అత్యుత్తమ ప్రయోగంగా పేరుతెచ్చుకొని రాష్ట్రస్థాయికి ఎంపికైంది. గతేడాది వరంగల్‌లో రాష్ట్ర స్థాయిలో నిర్వహించిన ఇన్‌స్పైర్‌ ప్రయోగ ప్రదర్శన పోటీలకు ఎంపికైంది. పాఠశాలకు చెందిన సైన్స్‌ ఉపాధ్యాయుడు ఐ.సుదర్షన్‌రావు మార్గదర్శి ఉపాధ్యాయునిగా ఈ ప్రయోగ ప్రదర్శనకు వ్యవహరించారు.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.