close

శుక్రవారం, డిసెంబర్ 06, 2019

ప్రధానాంశాలు

కార్యశూరులు

వివిధ రంగాల్లో రాణిస్తున్న చిన్నారులు

న్యూస్‌టుడే, అచ్చంపేట

భారత తొలి ప్రధాని పండిట్‌ జవహర్‌లాల్‌ నెహ్రూ జన్మదినాన్ని బాలల దినోత్సవంగా జరుపుకుంటున్నారు. నెహ్రూకు పిల్లలతో ఉన్న అనుబంధానికి సూచికగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పిల్లలు నెహ్రూను ప్రేమగా చాచా అని పిలిచే వారు. ఆయనకు పిల్లలంటే చాలా ఇష్టం. భావిభారత నిర్మాతలని పిలిచేవారు. ఈ నేపథ్యంలో బాలబాలికలు వివిధ రంగాల్లో చూపిన ప్రతిభ గురించి తెలుసుకొందాం..

జాతీయస్థాయిలో రాణిస్తున్న అజయ్‌

హైదరాబాదులోని హకీంపేట క్రీడా పాఠశాలలో పదో తరగతి చదువుతున్న బోగరాజు అజయ్‌ రోయింగ్‌ పోటీల్లో సత్తా చాటుతున్నాడు. పదర మండల కేంద్రానికి చెందిన నిరుపేద వ్యవసాయ కుటుంబంలో పుట్టి అత్యంత ప్రతిభను చాటుకుంటున్నాడు. జిల్లా, రాష్ట్ర స్థాయి ఎంపిక పోటీల్లో ప్రతిభను చాటుకొని 2013లో హకీంపేట క్రీడా పాఠశాలలో నాలుగో తరగతిలో చేరాడు. ఆరో తరగతిలో నచ్చిన క్రీడాంశాన్ని ఎంపిక చేసుకునే అవకాశం ఉండటంతో రోయింగ్‌లో శిక్షణ తీసుకుంటున్నాడు. రెండేళ్ల కిందట కోల్‌కతాలో నిర్వహించిన 20వ సబ్‌ జూనియర్‌ జాతీయస్థాయి రోయింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో పాల్గొని 1.59.27 సెకన్లలో 500 మీటర్లు పూర్తి చేసి రెండో స్థానంలో నిలిచాడు. మొదటి ప్రయత్నంలోనే జాతీయ స్థాయిలో రజత పతకం సాధించి సత్తాను చాటుకున్నాడు.

సాయిప్రణవి సత్తా..

పదర మండలం వంకేశ్వరానికి చెందిన చింతోజు రవీందర్‌కుమార్‌, శారద దంపతుల కుమార్తె సాయిప్రణవి గాయనిగా రాణిస్తూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటోంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో పదో తరగతి చదువుతూ గాయనిగా ఎన్నో ప్రదర్శనలు ఇచ్చింది. పాటలు పాడటం ఆమెకు ప్రాణం. చిన్నప్పట్నుంచే పాటలు పాడడంపై ఆసక్తిని పెంచుకుంది. మూడో తరగతి నుంచి సంగీతంలో శిక్షణ పొందుతోంది. పాటే శ్వాసగా అదే ధ్యాసగా ముందుకు సాగుతోంది. రాష్ట్రస్థాయిలో వివిధ వేదికలపై ఇప్పటి వరకు 50 వరకు ప్రదర్శనలు ఇచ్చింది.

సత్తా చాటుతున్న అక్కా చెల్లెళ్లు

సెయిలింగ్‌లో ఆర్‌.కీర్తి

ఉప్పునుంతల మండలం గట్టుకాడిపల్లికి చెందిన అక్కాచెల్లెళ్లు క్రీడాపాఠశాలలో అవకాశం దక్కించుకొని విభిన్న క్రీడాంశాల్లో సత్తాను చాటుకున్నారు. నిరుపేద కుటుంబానికి చెందిన తిరుపతయ్య ఇద్దరు కుమార్తెలు ఆర్‌.కావ్య, ఆర్‌.కీర్తి హకీంపేట క్రీడాపాఠశాలలో విద్యాభ్యాసం చేస్తూ రాణిస్తున్నారు. కావ్య విలువిద్య పోటీల్లో సత్తా చాటుతుండగా కీర్తి సెచిలింగ్‌లో దూసుకుపోతోంది. వివిధ పోటీల్లో పాల్గొని సత్తాను చాటి ఎన్నో పతకాలు సొంతం చేసుకున్నారు.

 

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.