close

శుక్రవారం, డిసెంబర్ 06, 2019

ప్రధానాంశాలు

మానుకోట.. రణరంగం

డ్రైవర్‌ ఆత్మహత్యతో దద్దరిల్లిన జిల్లా కేంద్రం

సమ్మెకు మద్దతుగా దీక్షలో కూర్చున్న ఆర్టీసీ ఐకాస రాష్ట్ర కన్వీనర్‌ అశ్వత్థామరెడ్డి

మహబూబాబాద్‌, మహబూబాబాద్‌, టౌన్‌: డ్రైవర్‌ ఆవుల నరేశ్‌ ఆత్మహత్యతో జిల్లా కేంద్రంలో బుధవారం ఒక్క బస్సు కూడా కదలలేదు. భద్రతాచర్యల్లో భాగంగా బస్సులను డిపోనకే పరిమితం చేశారు. మహిళా కార్మికుల రోదనలు కదలించివేశాయి. పార్థీవదేహానికి ప్రజా, విద్యార్థి సంఘాల నాయకులు నివాళులర్పించారు.

మాకు దిక్కెవరూ..

‘అనారోగ్యంతో ఉన్న నన్ను.. ఏ ఆధారం లేని పిల్లలను ఒంటరిని చేసి వెళ్లి పోయావా.. అంటూ నరేశ్‌ భార్య పూలమ్మ రోధించిన తీరు అందరి హృదయాలను ద్రవింపజేసింది. బాధల నుంచి బయట పడుతున్నామన్న లోపే నేను అనారోగ్యానికి గురయ్యాను.. పిల్లలను చదివిస్తూ వారికో దారి చూపుతావనుకున్నా.. ఇప్పుడు మాకు దిక్కెవరు అంటూ కంటనీరు పెట్టారు.

డిపోలోనే నిలిచిన బస్సులు

అత్తగారి గ్రామంలోనే అంత్యక్రియలు..

డ్రైవర్‌ నరేశ్‌ స్వగ్రామం సూర్యాపేట జిల్లా గోరంట్ల గ్రామం. అయితే ఉద్యోగరీత్యా చాన్నాళ్ల కిందటే మహబూబాబాద్‌కి వచ్చి అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నారు. అత్తవారిల్లు అయిన మరిపెడ మండలం ఎల్లంపేట గ్రామంలో కొంత భూమి ఉంది. ఇక్కడ వ్యవసాయం చేస్తుంటారు. ఈ నేపథ్యంలోనే అంత్యక్రియలను ఎల్లంపేటలోనే నిర్వహించారు.

తొర్రూరు టౌన్‌, న్యూస్‌టుడే: ఆర్టీసీ కార్మికుల ఆత్మహత్యలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని ఆర్టీసీ ఐకాస రాష్ట్ర కన్వీనర్‌ అశ్వత్థామరెడ్డి తెలిపారు. మహబూబాబాద్‌ జిల్లా తొర్రూరు డివిజన్‌ కేంద్రంలోని కార్మికుల దీక్షకు బుధవారం ఆయన సంఘీభావం ప్రకటించారు. మహబూబాబాద్‌ డిపోలో పనిచేస్తున్న డ్రైవర్‌ నరేష్‌ ఆత్మహత్యకు పాల్పడగా మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు ఎల్లంపేటకు వెళుతున్న సందర్భంగా తొర్రూరు దీక్ష శిబిరం వద్ద ఆయన మాట్లాడారు. సమ్మెతో జీతాలు రాక కార్మికులు దుర్భర జీవితాలను గడపుతున్నారన్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి న్యాయమైన డిమాండ్‌లు పరిష్కరించాలన్నారు. కార్యక్రమంలో వామపక్ష పార్టీల నాయకులు వై.వెంకటయ్య, కొత్తపల్లి రవి, ఓమ భిక్షపతి, అశోక్‌, వీరన్న, ఐకాస ప్రతినిధులు పాల్గొన్నారు.

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.