close

శుక్రవారం, డిసెంబర్ 06, 2019

ప్రధానాంశాలు

నగరపాలక సంస్థ కమిషనర్‌ బదిలీ

ఇన్‌ఛార్జి కమిషనర్‌గా అనురాగ్‌జయంతి

ఖమ్మం నగరపాలకం, న్యూస్‌టుడే: నగరపాలక సంస్థ కమిషనర్‌ జె.శ్రీనివాసరావును బదిలీ చేస్తూ పురపాలక శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ అరవింద్‌కుమార్‌ బుధవారం ఉత్తర్వులు జారీచేశారు. గత ఏడాది ఆగష్టు 26న బాధ్యతలు స్వీకరించిన కమిషనర్‌ 15నెలల పాటు విధులు నిర్వహించారు. ఈ ఏడాది సెప్టెంబర్‌లోనే వ్యక్తిగత కారణాలతో బదిలీకి దరఖాస్తు చేసుకున్నారు. బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి తనదైన శైలితో ఆకట్టుకున్నారు. అన్ని వర్గాలను కలుపుకొని పోతూ విధులు నిర్వర్తించారు. ప్రధానంగా ఆస్తిమార్పిడి, జనన, మరణాల నమోదు పత్రాల జారీని సరళతరం చేయడంతోపాటు పత్రాల జారీని వేగవంతం చేశారు. సుదీర్ఘకాలంగా పెండింగ్‌లోఉన్న వారసత్వ నియామకాలను పూర్తి చేసి 15 కుటుంబాల్లో వెలుగులు నింపారు. ట్యాంక్‌బండ్‌పై గాంధీ జిల్లా పర్యటన చిత్రం నిర్దేశించిన సమయంలో నిర్మాణం, వందడుగుల ఎత్తులో జాతీయజెండాను ఏర్పాటుచేయడం, కొత్తడంపింగ్‌యార్డుకు స్థల సేకరణ, శాసనసభ, పార్లమెంటు ఎన్నికల సమయంలోనూ ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌ఛార్జిగా బాధ్యతలు నిర్వహించి ఉన్నతాధికారుల ప్రశంసలందుకున్నారు. వివిధ పనుల నిమిత్తం కార్యాలయానికి వచ్చే వారికి ఓపికగా సమాధానమిస్తూ వీలైతే సమస్యను వెంటనే పరిష్కరించేందుకు చర్యలు తీసుకున్న అధికారిగా ప్రత్యేకత చాటుకున్నారు. వాట్సప్‌ ద్వారా తన దృష్టికి తెచ్చిన పారిశుద్ధ్య సమస్యలను పరిష్కరించడం, తిరిగి ఫిర్యాదుదారుతో మాట్లాడటం ద్వారా నగర ప్రజల అభిమానాన్ని చూరగొన్నారు.

అనురాగ్‌జయంతికి బాధ్యతలు: నగరపాలక సంస్థ ఇన్‌ఛార్జి కమిషనర్‌గా అనురాగ్‌జయంతిని నియమించినట్టు తెలుస్తోంది. రాష్ట్ర పురపాలక శాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్‌ ఆర్వీ.కర్ణన్‌ అనురాగ్‌జయంతికి బాధ్యతలు అప్పగించినట్టు తెలుస్తోంది.

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.