close

బుధవారం, డిసెంబర్ 11, 2019

ప్రధానాంశాలు

యువకుడి అనుమానాస్పద మృతి

మృతదేహాన్ని పరిశీలించిన డీఎస్పీ  రాఘవరెడ్డి


మృతదేహాన్ని పరిశీలిస్తున్న డీఎస్పీ  రాఘవరెడ్డి

దగదర్తి, న్యూస్‌టుడే : దగదర్తికి చెందిన గండికోట కార్తీక్‌ (23) మంగళవారం రాత్రి అనుమానాస్పదంగా మృతిచెందారు. ఆయన నడుపుతున్న దాబాలో అచేతనంగా పడి ఉండటాన్ని చూసిన వంట మనిషి సర్వేశ్వరరావు గ్రామస్థులకు సమాచారమిచ్చారు. వారి సాయంతో ఆయన్ను రాజుపాళెంలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా వైద్యులు పరీక్షించి మృతిచెందినట్లుగా నిర్ధరించారు. సంఘటనా స్థలంలోని పైపునకు వేలాడుతున్న విద్యుత్తు తీగకు ఉరి వేసుకుని మృతిచెంది ఉంటాడని కొందరు అంటుండగా.. కనీసం అయిదు అడుగుల ఎత్తు కూడా లేని ఆ ఇనుపరాడ్డుకు ఎలా ఉరి వేసుకొని మృతిచెంది ఉంటాడని మరికొందరు అనుమానిస్తున్నారు. మృతుడు ఒక పార్టీకి సానుభూతిపరుడు కావడంతో వారు ఆందోళనలు నిర్వహిస్తారనే సమాచారంతో పోలీసు బందోబస్తు ఏర్పాటుచేశారు. నెల్లూరు రూరల్‌ డీఎస్పీ రాఘవరెడ్డి, బుచ్చిరెడ్డిపాళెం సీఐ సురేష్‌ స్థానిక పోలీసుస్టేషన్‌కు చేరుకున్నారు. మధ్యాహ్నం వరకూ మృతుని బంధువుల నుంచి ఫిర్యాదు రాకపోవడంతో వేచిచూశారు. అనంతరం మృతుడి తండ్రి వెంకటరాజు, తల్లి మాధవి నుంచి రెండు విభిన్న ఫిర్యాదులు పోలీసులకు అందాయి. వీటిలో మృతుడి తల్లి ఇచ్చిన ఫిర్యాదును పరిగణనలోకి తీసుకొన్న పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. మృతుడి ఎడమ చేతిపై ఆరు చోట్ల గాయాలున్నాయి. గొంతుపై నల్లగా కమిలిపోయినట్లుగా గీత ఉంది. మృతునికి భార్య లత ఉంది. ఆయనకు ఏడాది కిందటే వివాహమైంది. ఈ సందర్భంగా నెల్లూరు డీఎస్పీ రాఘవరెడ్డి మాట్లాడుతూ కుటుంబ కలహాల కారణంగానే మృతుడు కార్తీక్‌ మృతిచెందినట్లుగా చెప్పారు. కొందరు నాయకులు చేస్తున్న ఆరోపణలు అవాస్తవమన్నారు. రాజకీయాలను కుటుంబాల్లో భార్యాభర్తల మధ్య వర్తింపజేయడం దారుణమన్నారు. ఈ సంఘటనకు సంబంధించిన పూర్తిస్థాయి విచారణను బుచ్చిరెడ్డిపాళెం సీఐ సురేష్‌ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు చెప్పారు. శవ పంచనామాను తహసీల్దార్‌ వరకుమార్‌ సమక్షంలో చేపడతామన్నారు. విచారణ నిష్పక్షపాతంగా చేస్తామన్నారు. తెదేపా నాయకులు మాలెపాటి రవీంద్రనాయుడు, సుబ్బానాయుడు కార్యకర్తలతో కలసి సంఘటనా స్థలానికి వచ్చి మృతుడి బంధువులను పరామర్శించారు. మండల వైకాపా నాయకుల వేధింపుల కారణంగానే కార్తీక్‌ మృతిచెందాడని ఆరోపించారు. తల్లి వివాహేతర సంబంధమే కార్తీక్‌ ఉసురు తీసిందని తండ్రి వెంకటరాజు పోలీసుల ఎదుట కన్నీరుమున్నీరయ్యారు.'

కార్తీక్‌ (పాతచిత్రం)

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.