close

బుధవారం, డిసెంబర్ 11, 2019

ప్రధానాంశాలు

కార్యదర్శినని నమ్మించి చోరీ


బాధితురాలు సుబ్బలక్ష్మమ్మ

మనుబోలు, న్యూస్‌టుడే : ఓ వ్యక్తి పంచాయతీ కార్యదర్శిని అని వృద్ధురాలికి చెప్పి చేతికి ఉన్న ఉంగరాన్ని తీసుకొని ఉడాయించాడు. ఈ ఘటన మండలంలోని మడమనూరు సమీపంలో బుధవారం చోటుచేసుకొంది. బాధితురాలి కథనం మేరకు వీరంపల్లి గ్రామానికి చెందిన మంగళపూరి సుబ్బలక్ష్మమ్మకి వృద్ధాప్య పింఛన్‌ వస్తోంది. ఇటీవల పింఛన్‌ ఆగిపోయింది. ఈ విషయం తెలుసుకున్న గుర్తు తెలియని వ్యక్తి మోటారుసైకిల్‌పై వృద్ధురాలి ఇంటికి వచ్చాడు. తాను పంచాయతీ కార్యదర్శిని అని, మండల కార్యాలయానికి వస్తే పింఛన్‌ ఇప్పిస్తానని నమ్మించాడు. అతని మాటలు నమ్మిన ఆ వృద్ధురాలు మోటారుసైకిల్‌పై అతనితోపాటు బయలుదేరింది. మడమనూరు గ్రామ సమీపంలో ద్విచక్ర వాహనాన్ని ఆపి ఉంగరం ఉంటే పింఛన్‌ ఇవ్వరని చెప్పి లాక్కొని అక్కడి నుంచి ఉడాయించాడు. ఆ వృద్ధురాలు అతన్ని వెదుక్కుంటూ మండల కార్యాలయానికి వచ్చి విచారించగా అక్కడ లేకపోవడంతో మోసం చేశాడంటూ లబోదిబోమంటూ రోదించింది.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.