close

బుధవారం, డిసెంబర్ 11, 2019

ప్రధానాంశాలు

నాడు-నేడు ప్రారంభం నేడు

● ప్రభుత్వ పాఠశాలలకు మహర్దశ

● మొదటి విడతగా 1060 ఎంపిక ●

డీఈవో జనార్ధనాచార్యులు


నాడు-నేడు కార్యక్రమానికి ముస్తాబైన జిల్లా విద్యాశాఖ ప్రధాన కార్యాలయం

నెల్లూరు (విద్య), న్యూస్‌టుడే :ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలను మార్చేందుకు ప్రభుత్వం సన్నద్ధమైంది. నాడు - నేడు కార్యక్రమంతో సర్కారు బడుల్లో పేద విద్యార్థులకు మౌలిక వసతులు కల్పించేందుకు నవ కాంతులు పేరిట తొమ్మిది రకాల వసతులతో బడుల రూపురేఖలు మార్చనున్నారు. దీనికోసం నేడు నగరంలోని దర్గామిట్టలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో ఈ కార్యక్రమాన్ని గురువారం లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఇందులో భాగంగా పాఠశాలల్లో నీటి సరఫరాతో పరిశుభ్రమైన మరుగుదొడ్లు, విద్యుత్‌ సౌకర్యం, ఫ్యాన్లు, ట్యూబ్‌లైట్స్‌, తదితర కరెంటు వసతి, తాగునీటి వసతి, విద్యార్థులకు, ఉపాధ్యాయులు, సిబ్బందికి కుర్చీలు, టెంట్‌లు, భవనాలకు రంగులు, చిన్న, పెద్ద మరమ్మతులు, బ్ల్లాక్‌ బోర్డులు, అదనపు తరగతి గదులు, ప్రహరి ఇలా 9 రకాల వసతులు కల్పించేందుకు శ్రీకారం చుట్టారు.

రూ. 101 కోట్లతో వసతులు : తొలివిడతగా జిల్లాలోని 1060 పాఠశాలల్లో విద్యా మౌలిక వసతులు కల్పించనున్నారు. దీనికోసం జిల్లాకు రూ.101 కోట్ల్లను కేటాయించారు. ఈ నిధులతో ఆయా పాఠశాలల్లో ఇప్పటికే ఏర్పడిన పాఠశాల తల్లిదండ్రుల కమిటీ సభ్యులచే పాఠశాలల్లో నెలకొని ఉన్న సమస్యలను పరిష్కరించనున్నారు.

మారనున్న రూపురేఖలు - డీఈవో జనార్ధనాచార్యులు

ప్రభుత్వ బడులను దశల వారీగా వాటి రూపురేఖలు మార్చేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంది. ఇందులో భాగంగా గురువారం నగరంలోని దర్గామిట్ట జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో మనబడి నాడు - నేడు కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. మొదటి విడతగా 1060 పాఠశాలలను గుర్తించి వాటిలో విద్యా మౌలిక వసతులు కల్పిస్తున్నాం.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.