శనివారం, డిసెంబర్ 07, 2019
భిక్కనూర్ గ్రామీణం, న్యూస్టుడే: మండలంలోని మోటాట్పల్లి గ్రామంలో బుధవారం సర్పంచి మోటాటి రాజేశ్వరి, ఎంపీపీ గాల్రెడ్డితో కలిసి వైకుంఠధామం నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం సర్పంచి మాట్లాడుతూ..ఉపాధి పథకం ద్వారా పనులు చేపడుతున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎంపీడీవో అనంతరావు, ఆత్మ కమిటీ ఛైర్మన్ నరసింహారెడ్డి, జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షులు నర్సింలు యాదవ్, విండో ఛైర్మన్ నర్సారెడ్డి, సాయిరెడ్డి, భగవంతు రెడ్డి, శ్రీను పాల్గొన్నారు.
శ్మశాన వాటిక పనులు ...
యాడారం(బీబీపేట): బీబీపేట మండలంలోని యాడారం గ్రామంలో శ్మశాన వాటిక నిర్మాణ పనులను బుధవారం ఎంపీపీ బాలమణి ప్రారంభించారు. కార్యక్రమంలో సర్పంచి వెంకట్రావు, ఉప సర్పంచి హరీష్, ఎంపీటీసీ సభ్యుడు లక్కర్సు రవి, ఎంపీడీవో నారాయణ, ఎంపీవో వెంకటనర్సయ్య. పంచాయతీ కార్యదర్శి బాలకృష్ణ, ఈసీ రాధిక. క్షేత్ర సహాయకుడు నారాయణరెడ్డి, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.
జిల్లా వార్తలు