close

శనివారం, డిసెంబర్ 07, 2019

ప్రధానాంశాలు

స్వచ్ఛ పాఠం!

30 రోజులు 4 విడతలు

 మున్సిపల్‌ పాఠశాలల్లో పారిశుద్ధ్యానికి చర్యలు

 నేటి నుంచి ప్రారంభం

నగర, పురపాలక సంఘాలు 7

ఉన్నత పాఠశాలలు 47

ప్రాథమిక 123

స్వచ్ఛ పాఠం!

ప్రాథమికోన్నత 33

ఉర్దూ పాఠశాలలు 8

నగర, పురపాలకసంఘాల్లోని పాఠశాలలు స్వచ్ఛ నిలయాలుగా మారనున్నాయి. దీనికోసం రాష్ట్ర ప్రభుత్వం నెల రోజుల ప్రత్యేక కార్యాచరణను రూపొందించింది. విడతల వారీగా కార్యక్రమాన్ని అమలు చేయనున్నారు. నాలుగు దశల్లో పాశాలల్లో పారిశుద్ధ్య పనులు చేపట్టనున్నారు. ఇందులో నగరంలో అయితే నగరపాలక సంస్థ పారిశుద్ధ్య సిబ్బంది, మున్సిపాలిటీలు అయితే మున్సిపల్‌ సిబ్బంది , స్వచ్ఛంద సంస్థలు, ఆరోగ్య సిబ్బంది ఈ పనులు చేస్తారు. విద్యార్థులు,ఉపాధ్యాయులు ఈ కార్యక్రమాలపై అవగాహన పెంచుకోవాల్సి ఉంది. పాఠశాలల్లో పారిశుద్ధ్యం మెరుగుపరిచి స్వచ్ఛమైన.. ఆహ్లాదకర వాతావరణంలో బోధన చేపట్టాలన్నది ప్రభుత్వ ముఖ్య ఉద్దేశం. తద్వారా విద్యార్థులు చక్కగా పాఠ్యాంశాలు నేర్చుకునేందుకు అవకాశం ఉంటుంది.

నెల్లూరు(నగరపాలకసంస్థ), న్యూస్‌టుడే జిల్లాలో నెల్లూరు నగరంతో పాటు కావలి, గూడూరు, ఆత్మకూరు, వెంకటగిరి, సూళ్లూరుపేట, నాయుడుపేట పట్టణాల్లో పురపాలక పాఠశాలలు ఉన్నాయి. ఈనెల 14 నుంచి డిసెంబరు 14 వరకు ఆయా పాఠశాలల్లో నాలుగు విడతలుగా ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టనున్నారు. వివిధ కార్యక్రమాలు చేపట్టాలని రాష్ట్ర పురపాలకశాఖ డైరెక్టర్‌, కమిషనర్‌ నుంచి నగరపాలక, పురపాలకసంఘాల కమిషనర్లకు ఉత్తర్వులు అందాయి.

ఒకటో విడత

ఈనెల 14 నుంచి 23 వరకు కొనసాగుతుంది. పాఠశాలల్లో పారిశుద్ధ్య పనులు చేయాలి. మరుగుదొడ్లు శుభ్రం చేయడం, చెత్తాచెదారాలు తొలగించాలి. మురుగునీరు నిల్వ ప్రాంతాల్లో దోమల నివారణ చర్యలు చేపట్టాలి. పిచ్చిమొక్కలు, ముళ్ల చెట్లు తొలగించాలి. క్రీడా మైదానాలను చదును చేసి ఆటలకు అనువుగా మార్చాలి. భవనాల మరమ్మతులు చేపట్టాల్సి ఉంటుంది. విద్యార్థులు, పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బందికి ఆటంకం కలుగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.

రెండో విడత

నవంబరు 25 నుంచి 30వ తేదీ వరకు చేపడతారు. రోటరీ క్లబ్‌, స్వచ్ఛందసంస్థల సహకారంతో పాఠశాలల ఆవరణంలో మొక్కలు నాటి పచ్చదనం పెంపునకు చర్యలు తీసుకోవాలి. తగరపు సంచుల వినియోగంతో కలిగే అనర్థాలపై విద్యార్థులకు అవగాహన కల్పించాలి. ప్లాస్టిక్‌ నిషేధంపై ప్రదర్శనలు చేపట్టాలి. పాఠశాలల్లో చెత్త సంపద తయారీ కేంద్రాలు, గృహాల్లోని వ్యర్థాలతో సేంద్రియ ఎరువు తయారీపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి.

మూడో విడత

డిసెంబరు 2 నుంచి 7 వరకు జరగనుంది. ఐఈసీ కార్యక్రమాలపై విద్యార్థులకు అవగాహన కల్పించాలి. విద్యార్థులతో కమిషనర్లు, పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఆరోగ్య సిబ్బంది, ఎన్జీవోలు మమేకం కావాలి. ఘన, వ్యర్థ పదార్థాల నిర్వహణ, పారిశుద్ధ్యంపై పిల్లలకు వ్యాసరచన, క్విజ్‌, చిత్రలేఖనం పోటీలు నిర్వహించాలి.

నాలుగో విడత

డిసెంరబరు 9 నుంచి 14వ తేదీ వరకు కొనసాగుతుంది. అధికారులు గుర్తించిన పాఠశాలలో వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి విద్యార్థులను పరీక్షించాలి.పాఠశాలల్లో దోమల నివారణకు చర్యలు తీసుకోవాలి.

పాఠశాలల్లో ఆహ్లాదకర వాతావరణం - పీవీవీఎస్‌ మూర్తి, కమిషనర్‌

ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకున్న విద్యార్థులకు ఆహ్లాదకర వాతావరణం కల్పించేందుకు నెల రోజుల పాటు ప్రత్యేక కార్యక్రమాలను చేపట్టాలని ఉత్తర్వులు అందాయి. నాలుగు విడతల్లో పరిసరాల శుభ్రత, పచ్చదనం, పారిశుద్ధ్య నిర్వహణపై దృష్టి సారిస్తాం. విద్యార్థులకు అవగాహన కల్పిస్తాం. వైద్య పరీక్షలు నిర్వహిస్తాం. ఉపాధ్యాయులు, ఎన్జీవోలు, ఆరోగ్య సిబ్బంది అందరి సహకారంతో విజయవంతం చేస్తాం.

 

 

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.