close

శనివారం, డిసెంబర్ 07, 2019

ప్రధానాంశాలు

ఇళ్లు లేని 3.17 లక్షల మంది పేదలు గుర్తింపు
దూరదృశ్య సమావేశం నిర్వహిస్తున్న కలెక్టర్‌ మురళీధర్‌రెడ్డి

కాకినాడ కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: జిల్లాలో ఇళ్లులేని పేదలు 3.17 లక్షల మంది ఉన్నట్లు గుర్తించామని, వీరందరికీ ఉగాది పర్వదినం రోజున పట్టాలు పంపిణీ చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నామని కలెక్టర్‌ డి.మురళీధర్‌రెడ్డి తెలిపారు. బుధవారం ఆయన కలెక్టరేట్‌ నుంచి తహసీల్దార్లు, సంబంధిత అధికారులతో దూరదృశ్య సమావేశం నిర్వహించారు. లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేయడానికి అవసరమైన భూములను గుర్తించాలని ఆయన ఆదేశించారు. గ్రామీణ ప్రాంతంలో 1,400 ఎకరాలు, పట్టణాల్లో 135 ఎకరాల భూమి అందుబాటులోకి వచ్చిందని, మరింత భూమి అవసరమన్నారు. ప్రభుత్వ సంస్థలకు గతంలో భూములు ఇచ్చి, నిరుపయోగంగా ఉంటే వాటిని వెనక్కి తీసుకోవాలన్నారు. పూడిపోయిన చెరువులను ఖాళీగా వదిలేస్తే ఆక్రమణలకు గురవుతాయని, వాటిని కూడా గుర్తించి, పేదలకు ఇళ్లపట్టాల పంపిణీకి ఏర్పాట్లు చేయాలని జలవనరుల శాఖ అధికారులకు సూచించారు. ఇప్పటికే గుర్తించిన భూములకు సంబంధించిన సర్వేను 23వ తేదీలోగా పూర్తి చేసి, గుడా అనుమతులు పొందాలన్నారు. అనంతరం రైతు భరోసాపై సమీక్షించారు. ఈ సమావేశంలో డీఆర్వో సీహెచ్‌ సత్తిబాబు, కాకినాడ మున్సిపల్‌ కమిషనర్‌ కె.రమేష్‌ తదితరులు పాల్గొన్నారు.

ఓటర్ల జాబితా పరిశీలనపై..

ఓటర్ల జాబితా పరిశీలన ప్రక్రియపై బుధవారం అమరావతి నుంచి రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి విజయానంద్‌ జిల్లా అధికారులతో దూరదృశ్య సమావేశం నిర్వహించారు. వచ్చే నెల 16వ తేదీ నాటికి జిల్లాలో ముసాయిదా ఓటర్ల జాబితా రూపకల్పనకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. కలెక్టరేట్‌ నుంచి హాజరైన కలెక్టర్‌ మురళీధర్‌రెడ్డి జిల్లా పరిస్థితి గురించి వివరించారు. 22న గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు.

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.