close

బుధవారం, డిసెంబర్ 11, 2019

ప్రధానాంశాలు

ప్రత్యేక హోదా సాధన దిశగా పోరాడాలి

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌కు మాజీ ఎంపీ ఉండవల్లి లేఖ

రాజమహేంద్రవరం (క్వారీసెంటర్‌), న్యూస్‌టుడే: ప్రత్యేక హోదా సాధన దిశగా పోరాడాలని, త్వరలో ప్రారంభంకానున్న పార్లమెంట్‌ శీతాకాల సమావేశాల్లో మన గళాన్ని వినిపించాలని కోరుతూ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డికి బుధవారం లేఖ రాశారు. దేశంలో ఏ రాష్ట్రానికీ జరగని అన్యాయం విభజనతో ఆంధ్రప్రదేశ్‌కు జరిగిందన్నారు. గతంలో ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా కూడా విభజన తీరును తప్పుబట్టారన్నారు. ఆ వ్యాఖ్యలపై సమావేశాల్లో చర్చించాలన్నారు. గతంలో చంద్రబాబునాయుడును కలిసిన సమయంలో లోక్‌సభ రూల్స్‌ 184, 193, 197, 377లను అనుసరించి నోటీసులు తయారుచేసి పంపించానని, ఆ కాపీలు, లోక్‌సభ ప్రశ్న-జీరో అవర్‌ నోటీసులు లేఖకు జతచేసి పంపిస్తున్నట్లు పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.