close

శనివారం, డిసెంబర్ 14, 2019

ప్రధానాంశాలు

క్రైమ్

ప్రభుత్వంపై బురద చల్లుతున్నారు: ఎంపీ భరత్‌

అవినీతికి పాల్పడినట్లు రుజువు చేస్తే రాజకీయ సన్యాసం స్వీకరిస్తా

వారంలో పూర్తిస్థాయిలో అందుబాటులోకి ఇసుక

సమావేశంలో మాట్లాడుతున్న ఎంపీ భరత్‌రామ్‌

రాజమహేంద్రవరం (దానవాయిపేట): రాష్ట్ర ప్రజల్లో తమ ప్రభుత్వానికి వస్తున్న ఆదరణను చూసి ఓర్వలేకే తెదేపా నాయకులు బురదజల్లే ప్రయత్నాలు చేస్తున్నారని రాజమహేంద్రరవం ఎంపీీ మార్గాని భరత్‌రామ్‌ మండిపడ్డారు. ఇసుక మాఫియాకు పెట్టింది పేరు తెదేపాయేనని విమర్శించారు. రాజమహేంద్రవరంలోని వీఎల్‌పురంలో ఉన్న ఎంపీ కార్యాలయంలో బుధవారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మరో వారంలో పూర్తిస్థాయిలో ఇసుకను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు, ప్యాకేజీ కల్యాణ్‌ కలిసి దీక్షలు, మార్చ్‌ల పేరుతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. వైకాపాకు చెందిన 67 మంది నాయకులపై ఛార్జిషీటు ప్రకటించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. తాను ఒక్క రూపాయి అవినీతికి పాల్పడినట్లు రుజువు చేస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని, లేని పక్షంలో చంద్రబాబు రాజకీయ సన్యాసం తీసుకుంటారా అని సవాల్‌ చేశారు. ఆంగ్లంపై పట్టు సాధిస్తే విద్యార్థుల భవిష్యత్తు బాగుంటుందనే ఉద్దేశంతోనే ప్రాథమిక స్థాయి నుంచే ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ఈ సమావేశంలో ఆ పార్టీ నగర, గ్రామీణం సమన్వయకర్తలు ఎస్‌.శివరామసుబ్రహ్మణ్యం, ఆకుల వీర్రాజు, మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు, నగర అధ్యక్షుడు నందెపు శ్రీనివాస్‌, గుర్రం గౌతం, నక్కా శ్రీనగేష్‌ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.