ఆదివారం, డిసెంబర్ 08, 2019
అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సమాఖ్య రాష్ట్ర మహాసభలు ప్రారంభం
బాగ్లింగంపల్లి, న్యూస్టుడే: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మహిళా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నాయని ఎంసీపీఐ (యూ) రాష్ట్ర కార్యదర్శి తాండ్రకుమార్ పేర్కొన్నారు. బుధవారం బాగ్లింగంపల్లి పాలమూరు బస్తీలోని ఓంకార్ భవన్ కేంద్ర కార్యాలయంలో అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సమాఖ్య (ఏఐఎఫ్డీడబ్ల్యూ) రాష్ట్ర ద్వితీయ మహాసభలు ప్రారంభమయ్యాయి. రెండు రోజుల పాటు జరిగే సభలకు మొదటి రోజు ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎంసీపీఐ (యూ) రాష్ట్ర కార్యదర్శి తాండ్రకుమార్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రభుత్వాలు మహిళలకు అన్ని రంగాల్లో సమాన అవకాశాలను కల్పించాలన్నారు. ఏఐఎఫ్డీడబ్ల్యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుంభం సుకన్య మాట్లాడుతూ పాలక ప్రభుత్వాలు ఏళ్ల తరబడి మహిళా సంక్షేమాన్ని విస్మరిస్తున్నారన్నారు. రాష్ట్ర కమిటీ సభ్యులు రాధక్క, జ్యోతి, ఝాన్సీ, సుజాత, గీత, లావణ్య, విమల, జయలక్ష్మీ పాల్గొన్నారు.
తాజా వార్తలు
జిల్లా వార్తలు