close

సోమవారం, డిసెంబర్ 09, 2019

ప్రధానాంశాలు

ఉద్యోగ భద్రత కల్పించాలి


కలెక్టరేట్‌ వద్ద మోకాళ్లపై నిలబడి నిరసన తెలుపుతున్న దృశ్యం

ఏలూరు కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: ముఖ్యమంత్రి బాలసురక్ష సిబ్బందికి ఉద్యోగ భద్రత కల్పించాలని ఒప్పంద ఉద్యోగుల ఐకాస జిల్లా ప్రధాన కార్యదర్శి పి.రవికుమార్‌ డిమాండ్‌ చేశారు. ముఖ్యమంత్రి బాలసురక్ష సంచార ఆరోగ్య వాహన ఉద్యోగులు కలెక్టరేట్‌ వద్ద మోకాళ్లపై నిలబడి గురువారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రవికుమార్‌ మాట్లాడుతూ బాల సురక్ష ఉద్యోగులకు ఆగస్టు నుంచి వేతనాలు చెల్లించడం లేదన్నారు. వేతన బకాయిలు చెల్లించాలని కోరుతూ నవంబరు 1 నుంచి ఉద్యోగులు సమ్మె చేస్తున్నా పట్టించుకోకపోవడం బాధాకరమన్నారు. బాలసురక్ష ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు డాక్టర్‌ టి.రాజేష్‌ మాట్లాడుతూ పేద విద్యార్థుల ఆరోగ్య సంరక్షణ కోసం బాలసురక్ష పథకాన్ని ప్రారంభించారని, ఈ పథకంలో పనిచేసే ఉద్యోగుల సమస్యలను పట్టించుకోవడం లేదన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ధనుష్‌ అనే సంస్థకు ఈ పథకం నిర్వహణ బాధ్యతను అప్పగించారని, సదరు సంస్థ ప్రతినిధులు ఈ పథకాన్ని నిర్వీర్యం చేస్తున్నారని ఆరోపించారు. అనంతరం జేసీ-2 తేజ్‌భరత్‌కు వినతిపత్రాన్ని అందజేశారు. ధర్నాలో బాలసురక్ష ఉద్యోగుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.పుష్పరాజు, కోశాధికారి టి.ఫణి కుమారి, వైద్యులు కె.సుజన, లీలా సౌజన్య తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.