ఆదివారం, డిసెంబర్ 08, 2019
ఎంపీ రఘురామకృష్ణంరాజు
మాట్లాడుతున్న నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు
ఏలూరు కలెక్టరేట్, న్యూస్టుడే: ప్రజలకు ప్రయోజనం చేకూరేలా ప్రభుత్వ పథకాలను అమలు చేయాలని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు అధికారులను ఆదేశించారు. జిల్లా అభివృద్ధి సమన్వయ, పర్యవేక్షణ కమిటీ (దిశ) సమావేశాన్ని కలెక్టరేట్లో గురువారం సాయంత్రం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను సమర్థంగా అమలు చేయాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. ప్రజల అభివృద్ధి, సంక్షేమం కోసం కేంద్రం నుంచి ఎలాంటి పథకాలకు సాయం అవసరమో అధికారులు తెలియజేస్తే నిధులు రప్పించేందుకు కృషి చేస్తామని తెలిపారు. కేంద్ర నిధులను సక్రమంగా వినియోగించాలని చెప్పారు. దిశ సమావేశాన్ని ప్రతి మూడు నెలలకోసారి నిర్వహిస్తామన్నారు. జిల్లా అధికారులంతా పూర్తి సమాచారంతో హాజరు కావాలని సూచించారు. ఉపాధి పథకం, ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన, ప్రధాన మంత్రి ఆవాస్ యోజన, స్వచ్ఛభారత్ మిషన్ తదితర కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు తీరుపై ఎంపీ సమీక్షించారు. కలెక్టర్ ముత్యాలరాజు మాట్లాడుతూ సమావేశంలో సమీక్షించిన అంశాలను అధికారులు నమోదు చేసుకుని, వాటిపై తీసుకునే చర్యలను తనకు నివేదించాలని ఆదేశించారు. సమావేశంలో పలు ప్రభుత్వ శాఖల అధికారులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
జిల్లా వార్తలు