close

శనివారం, డిసెంబర్ 14, 2019

ప్రధానాంశాలు

జాతీయ-అంతర్జాతీయ

ఓర్వలేకనే తెదేపా విమర్శలు

రైతులు సుభిక్షం.. అందుకే శ్రీశైలానికి పాదయాత్ర

పాణ్యం ఎమ్మెల్యే కాటసాని

కంకణం కడుతున్న సతీమణి ఉమామహేశ్వరమ్మ

బనగానపల్లి పట్టణం : ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌రెడ్డి తన పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు రైతులకు వైఎస్‌ఆర్‌ రైతుభరోసా పథకం అమలు చేయడం ఓర్వలేకనే తెదేపా నాయకులు విమర్శలు చేస్తున్నారని పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి విమర్శించారు. యాగంటి నుంచి శ్రీశైలానికి పాదయాత్రను గురువారం ఆయన ప్రారంభించారు. ముందుగా ఉమామహేశ్వరస్వామి ఆలయంలో పూజలుచేసి తన పాదయాత్రను మొదలుపెట్టారు. సంఘీభావంగా ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి, వైకాపా నేత ఎర్రబోతుల వెంకటరెడ్డి పాల్గొన్నారు. బనగానపల్లి చేరుకున్న వారికి స్థానిక వైకాపా నాయకులు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ శ్రీశైలం, గోరుకల్లు జలాశయాలు నిండి రైతులు సుభిక్షంగా ఉంటే పాదయాత్ర చేస్తానన్న మొక్కు ఉండటంతో చెల్లించుకుంటున్నట్లు చెప్పారు. ఎన్నడూ లేనివిధంగా రాష్ట్రంలో జలాశయాలు నిండుకుండలను తలపిస్తున్నాయన్నారు. చంద్రబాబు పాలనలో రైతులు నీటికోసం అష్టకష్టాలు పడ్డారని, శ్రీశైలం జలాశయం నుంచి రైతులకు అతికష్టం మీద సాగునీటిని విడుదల చేయించుకోవాల్సి వచ్చిందన్నారు. ఈ ఏడాది ఎన్నడూలేని విధంగా శ్రీశైలం గేట్లు 7 సార్లు ఎత్తినట్లు చెప్పారు. గోరుకల్లు జలాశయం దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్‌రెడ్డి ముందుచూపే కారణమని, అదేబాటలో ఆయన తనయుడు ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌రెడ్డి కృషి చేస్తున్నారన్నారు. అనంతరం ఎర్రబోతుల వెంకటరెడ్డి మాట్లాడారు. మొదటిరోజు నందవరం గ్రామంలో రాత్రిబస ఉంటుందని నాయకులు తెలిపారు. కాటసాని సోదరులు చంద్రశేఖర్‌రెడ్డి, ప్రసాద్‌రెడ్డి, తిరుపాల్‌రెడ్డి, రమాకాంత్‌రెడ్డి, పాణ్యం వైకాపా నాయకులు సూర్యనారాయణరెడ్డి, బొగ్గరపు నాగరాజు, బనగానపల్లి వైకాపా నాయకులు, కార్యకర్తలు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.

మద్దతుగా పాల్గొన్న ఎమ్మెల్యే రామిరెడ్డి, పార్టీ నాయకులు

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.