close

సోమవారం, డిసెంబర్ 16, 2019

ప్రధానాంశాలు

క్రైమ్

ధాన్యరాశి ఎదురుచూపు

జిల్లాలో పూర్తి స్థాయిలో ప్రారంభం కాని కొనుగోలు కేంద్రాలు

వెబ్‌సైట్‌లో రైతుల పేర్ల నమోదుకు సాంకేతిక సమస్యలు

పలుచోట్ల ఊపందుకున్న వరి కోతలు

పి.గన్నవరం మండలం ఆర్‌.ఏనుగుపల్లిలో ధాన్యం ఆరబెడుతున్న రైతు

కాకినాడ కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: జిల్లాలో సార్వా వరి కోతలు ప్రారంభమయ్యాయి. తూర్పు, మధ్య డెల్టా ప్రాంతాల్లో ధాన్యం దిగుబడులు వస్తున్నాయి. కొన్ని చోట్ల యంత్రాలతో నూర్పిడి ప్రక్రియను చేపడుతున్నారు. ధాన్యపు రాశులు అమ్మకానికి ఎదురుచూస్తున్నాయి. తేమ శాతం ఎక్కువగా ఉండటంతో రైతులు పంటను ఆరబెట్టే పనిలో నిమగ్నమయ్యారు. జిల్లాలో 20 శాతం మేర వరి కోతలు పూర్తయినట్లు వ్యవసాయ శాఖ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఇప్పటి వరకు వరి దిగుబడులు కూడా ఆశాజనకంగానే ఉన్నాయని అధికారులు పేర్కొంటున్నారు. మరోవైపు జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు మాత్రం ఇంకా పూర్తి స్థాయిలో అందుబాటులోకి రాలేదు. ధాన్యానికి కనీస మద్దతు ధర కల్పించేందుకు చాలా సంవత్సరాలుగా జిల్లాలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. దళారులు, మధ్యవర్తుల బారిన పడకుండా రైతులను ఆదుకోవడానికి ఈ కేంద్రాలు దోహదపడాలన్నది ప్రభుత్వ సంకల్పం. జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుపై ..మిగతా 7లోగత రెండు నెలలుగా యంత్రాంగం కసరత్తు చేస్తున్నా ఇప్పటికీ వాటిని ప్రారంభించక పోవడం రైతులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. ఈ ఏడాది ధాన్యం మద్దతు ధరను క్వింటాలుకు రూ.65 చొప్పున కేంద్ర ప్రభుత్వం పెంచింది. దీంతో రైతులు కొనుగోలు కేంద్రాల్లో ధాన్యాన్ని విక్రయించేందుకు ఆసక్తి చూపుతున్నారు. జిల్లాలో ఖరీఫ్‌లో 300 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఉన్నతాధికారులు నిర్ణయించారు. ఈమేరకు ఇప్పటికే 256 కేంద్రాల ఏర్పాటుకు అనుమతించారు. మరో 30 కేంద్రాల అనుమతులకు దస్త్రాలను సిద్ధం చేశారు. ప్రస్తుతం అనుమతులు జారీ చేసిన కేంద్రాల్లో సహకార పరిపతి సంఘాలకు ఇచ్చినవే ఎక్కువగా ఉన్నాయి. సహకార శాఖ వీటి ఏర్పాటుపై మీనమేషాలు లెక్కిస్తోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నవంబరు నెలాఖరుకు ధాన్యం కోతలు దాదాపుగా పూర్తి కానున్న తరుణంలో అన్ని చోట్లా కొనుగోలు కేంద్రాలను ప్రారంభించక పోవడం రైతులను అయోమయానికి గురిచేస్తోంది.

పేర్లు నమోదు ఎప్పుడో..?

ధాన్యం కొనుగోళ్లలో అవకతవకలను అరికట్టేందుకు ఖరీఫ్‌ సీజన్‌ నుంచి ముందుగా కొనుగోలు కేంద్రాల్లో రైతుల పేర్లు నమోదు చేసుకునే ప్రక్రియను అధికారులు తప్పనిసరి చేశారు. వీటిలో రైతులకు చెందిన భూమి వివరాలు, ఆధార్‌ కార్డు, పట్టాదారు పాసుపుస్తకాలు, బ్యాంకు ఖాతా వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది. కౌలు రైతులు అయితే రెవెన్యూ అధికారుల నుంచి ఇచ్చే సాగు ధ్రువీకరణ పత్రం ఉండాలి. రైతుల పేర్లను జాతీయ ఆహార భద్రత చట్టం వెబ్‌సైట్‌లో నమోదు చేయాల్సి ఉంటుంది. ఈ వెబ్‌సైట్‌ సక్రమంగా పనిచేయక పోవడంతో రైతుల పేర్ల నమోదుకు సాంకేతిక సమస్య ఏర్పడుతోంది. దీన్ని పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకురావాల్సిన అవసరముంది. బిక్కవోలు మండలం పందలపాకలో గురువారం పేర్ల నమోదు ప్రక్రియను చేపట్టారు. ఈ వెబ్‌సైట్‌ పూర్తి స్థాయిలో పనిచేయకపోతే ధాన్యం కొనుగోళ్లకు మరింత సమయం పట్టే అవకాశం ఉంది.

ఖరీఫ్‌లో వరి దిగుబడులు ఇలా..

జిల్లాలో సాగు విస్తీర్ణం : 2,20,927 హెక్టార్లు

ధాన్యం ఉత్పిత్తి అంచనా : 13,66,986 మెట్రిక్‌ టన్నులు

రైతులు వినియోగించే ధాన్యం : 2,73,397 మెట్రిక్‌ టన్నులు

మార్కెట్‌లో విక్రయించే ధాన్యం : 10,93,589 మెట్రిక్‌ టన్నులు

కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరించేది : 10,60,000 మెట్రిక్‌ టన్నులు

ధాన్యం కొనుగోలుకు విస్తృత ఏర్పాట్లు

జిల్లాలో ఖరీఫ్‌ సీజన్‌లో ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు విస్తృత ఏర్పాట్లు చేశాం. జిల్లా వ్యాప్తంగా 300 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నాం. వీటన్నింటినీ త్వరితగతిన మనుగడలోకి తెస్తాం. ఈ కేంద్రాలకు అవసరమైన సామగ్రిని ఇప్పటికే సరఫరా చేశాం. 160 మంది వ్యవసాయ సహాయకుల సేవలను వినియోగించుకోనున్నాం. రైతులకు కనీస మద్దతు ధర కల్పించడమే లక్ష్యంగా చర్యలు తీసుకుంటున్నాం. రైతుల పేర్ల నమోదుకు అన్ని చర్యలు చేపడుతున్నాం. రెవెన్యూ, వ్యవసాయ, మార్కెటింగ్‌ శాఖలను సమన్వయం చేసి పూర్తి స్థాయిలో ధాన్యం కొనుగోలుకు ఏర్పాట్లు చేశాం.

- ఈ.జయరాములు, జిల్లా మేనేజర్‌, పౌరసరఫరాల సంస్థ

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.