close

సోమవారం, డిసెంబర్ 16, 2019

ప్రధానాంశాలు

క్రైమ్

విమర్శలు చేయడం ప్రతిపక్షాల హక్కు: ఉండవల్లి
సమావేశంలో మాట్లాడుతున్న మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌

రాజమహేంద్రవరం (క్వారీసెంటర్‌), న్యూస్‌టుడే: పార్లమెంటు సమావేశాల్లో రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధన దిశగా పోరాడాలని కోరుతూ తాను బుధవారం ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డికి లేఖ రాశానని, దీనిపై ఆయన సానుకూలంగా స్పందిస్తారని ఆశిస్తున్నట్లు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌ పేర్కొన్నారు. స్థానిక ప్రకాశ్‌నగర్‌లోని ధర్మంచర సామాజిక భవనం వద్ద గురువారం ఉదయం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఇసుక, ఆంగ్లమాధ్యమం వంటి నిర్ణయాలకు వ్యతిరేకంగా విమర్శలు చేయడం ప్రతిపక్ష నాయకులుగా చంద్రబాబు, పవన్‌, వామపక్ష నాయకుల హక్కు అన్నారు. వాటిపై 151 సీట్లు, 51 శాతం ఓట్లు సాధించిన అధికార పార్టీగా వైకాపా ప్రతి విమర్శలు చేయకుండా బాధ్యతగా వ్యవహరించాల్సిన అవసరముందన్నారు. ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెట్టడం తప్పుకాదని, అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో తెలుగు తప్పనిసరిగా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. నూతన ఇసుక విధానంతో నేరుగా ప్రభుత్వ ఖజానాకు చేరుతుందని, గతంలో రాజకీయనాయకుల జేబుల్లోకి ఈ సొమ్ము చేరేదని ఆరోపించారు. జగన్‌ ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు లేవని, తన వాళ్ల పనులు చేసుకుంటున్నారని విమర్శలున్నాయన్నారు. అధికారుల్లో క్రమేపీ అవినీతి తగ్గుతుందని అభిప్రాయపడ్డారు. అన్ని మతాల వారు సామరస్యంతో మెలగాలన్నారు. మాజీ ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ దూరదృష్టితోనే దేశం ఇంతగా అభివృద్ధి చెందిందన్నారు. ఈ సమావేశంలో అచ్యుత్‌దేశాయ్‌, అల్లు బాబీ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.