ఆదివారం, డిసెంబర్ 08, 2019
నాంపల్లి, న్యూస్‌టుడే: బాలల సంరక్షణ, వారి హక్కుల పరిరక్షణకు మై ఛాయిసెస్ ఆర్గనైజేషన్ సంస్థ చేస్తున్న కృషి ప్రశంసనీయమని దక్షిణ మధ్య రైల్వే ఆర్పీఎఫ్ డీఐజీ రమేష్‌చంద్ర, సీనియర్ డివిజనల్ సెక్యూరిటీ కమిషనర్ బి.రామకృష్ణ అభివర్ణించారు. బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని గురువారం సాయంత్రం నాంపల్లి రైల్వేస్టేషన్లో మై ఛాయిసెస్ ఆర్గనైజేషన్ చైల్డ్‌లైన్ హెల్ప్‌డెస్క్ ఆధ్వర్యంలో చైల్డ్‌లైన్‌సే దోస్తీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కార్యక్రమానికి రమేష్‌చంద్ర, రామకృష్ణ హాజరై వారోత్సవాలకు సంబంధించిన బ్రోచర్లు, పోస్టర్లు, కరపత్రాలను ఆవిష్కరించారు. కార్యక్రమంలో నాంపల్లి రైల్వేస్టేషన్ డైరెక్టర్ ఇక్బాల్ అహ్మద్ఖురేషీ, ఆర్పీఎఫ్ సీఐ జనార్దన్‌చౌదరి, జీఆర్పీ సీఐ ఎ.శ్రీనివాస్, చైల్డ్ హెల్ప్‌డెస్క్ సమన్వయకర్త మహ్మద్ నజీమ్, చైల్డ్‌లైన్ కౌన్సిలర్ రాందాస్, బృంద సభ్యులు, రైల్వే సిబ్బంది పాల్గొన్నారు.
తాజా వార్తలు
జిల్లా వార్తలు