close

ఆదివారం, డిసెంబర్ 08, 2019

ప్రధానాంశాలు

‘సాయిబాబా ఇచ్చిన నాణేల పేరున గుడి నిర్మాణం’

ఖైరతాబాద్‌, న్యూస్‌టుడే: షిర్డీ సాయిబాబా తనకు సేవలు చేసిన లక్ష్మీబాయి షిండే అనే మహిళకు జీవ సమాధి పొందే ముందు 1918 అక్టోబరు 15న తొమ్మిది వెండి నాణేలు బహూకరించారని ఆమె మునిమనవడు అరుణ్‌ గైక్వాడ్‌ పేర్కొన్నారు. ఆ నాణేల పేరుతో షిర్డీ సమీపంలో నైన్‌ కాయిన్స్‌ టెంపుల్‌ నిర్మిస్తున్నట్లు వివరించారు. లక్డీకాపుల్‌లోని హోటల్‌ అశోకలో గురువారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన నాణేలను ప్రదర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. లక్ష్మీబాయి షిండే ఆ నాణేలను తన మనవరాలు శైలజకు బహూకరించారని.. తాను ఆ శైలజ తనయుడినని వివరించారు. బాబా ఇచ్చినప్పటి నుంచి నాణేలు పూజలు అందుకుంటున్నాయని, ఆలయం ఏర్పాటయ్యాక పూజలు శాశ్వత ప్రాతిపదికన కొనసాగనున్నాయని పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.