close

శనివారం, డిసెంబర్ 07, 2019

ప్రధానాంశాలు

పదిలో నూరు శాతం ఉత్తీర్ణతే లక్ష్యం!

90 రోజుల ఛాలెంజ్‌ లెర్నింగ్‌ ప్రోగ్రాం రూపకల్పన

రాష్ట్రంలో జిల్లాలోనే ప్రయోగాత్మకంగా అమలు

సాంఘిక సంక్షేమ జిల్లా డిప్యూటీ డైరెక్టర్‌ కృషి

90 రోజుల ఛాలెంజ్‌ ఉద్దేశాలిలా..


విద్యార్థులకు బోధన చేస్తున్న డిప్యూటీ డైరెక్టర్‌ జీవపుత్రకుమార్‌

వసతిగృహాల్లో చదివే విద్యార్థుల్లో అధికంగా ‘నేను ఉత్తీర్ణత సాధిస్తానా’ అనే అపనమ్మకాన్ని తొలగించడం

గైడ్లు చదవడాన్ని పూర్తిగా నిషేధించి ప్రతిరోజు ప్రణాళికా బద్ధంగా పాఠ్యాంశ పుస్తకాలనే చదివేలా చూడటం

బట్టీ చదువులకు స్వస్తిపలికి మోడల్‌ పేపర్లపై కసరత్తు చేయడం

 అందరిలోనూ పఠనాశక్తిని పెంచడం, విద్యార్థులకు టిప్స్‌ తెలియజేయడం చేస్తారు.

 డిప్యూటీ డైరెక్టర్‌ ప్రత్యేకంగా నిపుణులతో తయారుచేసిన మోడల్‌ పేపర్లు, ఇతర మెటీరియల్‌పై సాధన చేయించడం

మొదటి విడతగా ఆగస్టు, సెప్టెంబరు, అక్టోబరు మాసాల్లో (90 రోజులు) చదవడం, నేర్చుకోవడం, రాయడం,

జనవరిలో వెనుకబడిన విద్యార్థులను గుర్తించి వారిపై ప్రత్యేక దృష్టి పెట్టడం

‘పది’ ఫలితాలు వచ్చాయంటే వసతిగృహాల్లో చదివే విద్యార్థులు అధికంగా తప్పుతున్నారు. వీరిపై సరైన పర్యవేక్షణ లేకపోవడం, అనుభవంలేని ట్యూటర్ల బోధనలు ప్రభావం చూపలేకపోతున్నాయి. మరోపక్క జిల్లా ఉన్నతాధికారులైన కలెక్టరు, ఆశాఖ అధికారులు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా ఉత్తీర్ణతలో మెరుగైన ఫలితాలు రావడం లేదు. పది ఫెయిలైన విద్యార్థులు తిరిగి పరీక్షలు రాసి మళ్లీ ఇంటర్‌లో చేరే వారిలో సగం మంది కూడా ఉండటం లేదు. మధ్యలోనే చదువు ఆగిపోవడం, కుటుంబాల పరిస్థితి అంతంతమాత్రమే కావడంతో కూలీ పనులు, చిన్న చిన్న ఉద్యోగాల్లో ఉపాధి పొందేందుకు వెళుతూ అంతటితో చదువులు చాలిస్తూ బంగారు భవిష్యత్తును దెబ్బతీసుకుంటున్నారు. ఈ పరిస్థితిని గమనించిన సాంఘిక సంక్షేమశాఖ జిల్లా డిప్యూటీ డైరెక్టర్‌ జీవపుత్రకుమార్‌ వసతిగృహాల్లో పదోతరగతి చదివే ప్రతివిద్యార్థి ఉత్తీర్ణత కావాలని ‘90 రోజుల ఛాలెంజ్‌ లెర్నింగ్‌ ప్రోగ్రాం’ అనే కార్యక్రమాన్ని రూపకల్పన చేశారు. రాష్ట్రంలో నెల్లూరులోనే ప్రయోగాత్మకంగా దీన్ని అమలు చేస్తున్నారు. ఫలితంగా విద్యార్థులకు అందించే బోధన, ఇప్పటివరకు సాధించిన సత్ఫలితాలు, తదితర విషయాలపై ‘న్యూస్‌టుడే’ కథనం.

కావలి, న్యూస్‌టుడే : జిల్లాలో 73 సాంఘిక సంక్షేమ వసతిగృహాలు ఉన్నాయి. ఇక్కడ పదో తరగతి చదివే విద్యార్థులు ఈ ఏడాది 1,289 మంది ఉన్నారు. గత విద్యా సంవత్సరంలో 84 శాతం మాత్రమే ఉత్తీర్ణత సాధించారు. ఇంకా ముందు సంవత్సరాలకు వెళితే ఈ ఉత్తీర్ణత శాతం చాలా తక్కువగా ఉంది. జిల్లాలో సాంఘిక సంక్షేమశాఖ జిల్లా డిప్యూటీ డైరెక్టర్‌గా బాధ్యతలు తీసుకున్న జీవపుత్రకుమార్‌ వసతిగృహాల సందర్శనకు వెళ్లగా పదో తరగతి చదివే విద్యార్థులు ఏమి చెప్పలేని పరిస్థితిని గమనించారు. దాంతో వారిపై ఆయన ప్రత్యేక దృష్టిసారించారు. సమస్యను జిల్లా కలెక్టరు శేషగిరిబాబు దృష్టికి తీసుకెళ్లి నూరుశాతం ఉత్తీర్ణత సాధించేందుకు తీసుకుంటున్న చర్యలను వివరించారు. కలెక్టరు ప్రోత్సాహంతో 90 రోజుల ఛాలెంజ్‌ లెర్నింగ్‌ ప్రోగ్రాం అనే కార్యక్రమాన్ని ఆగస్టులో ప్రారంభించారు.

ఎలాంటి ప్రశ్న ఇచ్చినా రాయగలిగేలా తీర్చిదిద్దుతున్నాం - జీవపుత్రకుమార్‌, సాంఘిక సంక్షేమశాఖ జిల్లా డిప్యూటీ డైరెక్టర్‌

సాంఘిక సంక్షేమ వసతిగృహాల్లో ‘పది’ చదివే ప్రతి విద్యార్థి ఉత్తీర్ణత సాధించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నాం. వార్షిక పరీక్షల్లో ఎలాంటి ప్రశ్న ఇచ్చినా రాయగలిగేలా విద్యార్థులను తీర్చిదిద్దుతున్నాం. జిల్లా కలెక్టరు దిశానిర్దేశంతో 90 రోజుల ఛాలెంజ్‌ లెర్నింగ్‌ ప్రోగ్రాం చేపట్టాం. ‘పది’ నేను ఉత్తీర్ణత సాధిస్తానా అనే అపనమ్మకాన్ని విద్యార్థుల నుంచి తొలగించాం. ప్రయోగాత్మకంగా చేపట్టిన ఛాలెంజ్‌ కార్యక్రమంలో మొదటి విడత పూర్తయ్యేనాటికి 800 మంది ఉత్తీర్ణత సాధిస్తారని గుర్తించాం. మిగిలిన 489 మందిపైనా ప్రత్యేక దృష్టిసారించాం. వీరిలో లెక్కల పాఠ్యాంశంలోని భయాలను తొలగిస్తూ ప్రత్యేక మెటీరియల్‌ అందించాం. ఉదయం, సాయంత్రం ఇద్దరు ట్యూటర్లు బోధన చేసేలా నియమించాం. పిల్లల్ని తల్లిదండ్రులు పదే పదే ఇళ్లకు తీసుకెళ్లడం ద్వారా చదువుపై ఏకాగ్రత తగ్గుతోంది. వీరు పదో తరగతి వచ్చేసరికి చాలా ఇబ్బంది పడుతున్నారు. తల్లిదండ్రుల్లోనూ మార్పు తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నాం.జ్ఞాపకశక్తిని పెంచు కోవడం రెండో విడతగా


పది విద్యార్థులకు మెలకువలు నేర్పుతున్న ట్యాటరు

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.