మంగళవారం, డిసెంబర్ 10, 2019
ముత్యంపేట(దోమకొండ), న్యూస్‌టుడే: మండలంలోని దోమకొండ, ముత్యంపేటలలో గురువారం సహకార వారోత్సవాలను ప్రారంభించారు. విండో కార్యాలయం వద్ద పీఏసీఎస్ అధ్యక్షులు నర్సారెడ్డి, తిరుపతిరెడ్డిలు వారోత్సవాల జెండాలను ఆవిష్కరించారు. ఈ నెల 21 వరకు వివిధ కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో పీఏసీఎస్ సీఈవోలు బాల్‌రెడ్డి, రాంచంద్రం, సర్పంచి సూర్యప్రకాశ్‌రెడ్డి, విండో ఉపాధ్యక్షుడు సార్ల నర్సింలు, విండో డైరెక్టర్లు పాల్గొన్నారు.
జిల్లా వార్తలు