శుక్రవారం, డిసెంబర్ 06, 2019
రెడ్డిపేట్(రామారెడ్డి): రెడ్డిపేట్ గ్రామానికి చెందిన కొయ్యల సంతోష్ అనుమతి లేకుండా ఇసుకను తరలిస్తుండడంతో ట్రాక్టర్‌ను జప్తు చేసినట్లు ఎస్సై రాజు గురువారం తెలిపారు. . తహసీల్దార్‌కు భైండోవర్ చేసినట్లు చెప్పారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
వాహనదారుల పాట్లు
కామారెడ్డి సంక్షేమం, న్యూస్‌టుడే: కామారెడ్డి మండలం పాతరాజంపేట రైల్వేగేటు మూసివేయడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరమ్మతుల పేరిట రైల్వేగేటును మూడు రోజుల పాటు మూసివేస్తున్నట్లు రైల్వే అధికారులు ప్రకటించిన విషయం విదితమే. కామారెడ్డి నుంచి రాకపోకలు సాగించడానికి పాతరాజంపేట వైపు మరో మార్గం లేకపోవడంతో పలువురు ద్విచక్ర వాహనదారులు నర్సన్నపల్లి అండర్ పాస్ బ్రిడ్జి మీదుగా రాకపోకలు సాగిస్తున్నారు. రోడ్డు ఎగుడు దిగుడుగా ఉండడంతో చోదకులు జారిపడుతున్నారు.
తాజా వార్తలు
జిల్లా వార్తలు