శుక్రవారం, డిసెంబర్ 06, 2019
కామారెడ్డి గ్రామీణం, న్యూస్‌టుడే: సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కార్యాలయం సైతం సహ చట్టం పరిధిలోకి వస్తుందని తీర్పు ఇవ్వడాన్ని స్వాగతిస్తున్నామని అఖిల భారత ప్రజాసేవ సహ చట్టం రాష్ట్ర ఉపాధ్యక్షుడు అంకం శ్యాంరావు పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. చట్టానికి ఎవరూ అతీతులు కాదని.. జవాబుదారీతనం, పారదర్శకతను పెంచే దిశగా వేసిన మొదటి అడుగని పేర్కొన్నారు. దేశంలో ఏ కోర్టు నుంచైనా ప్రజలకు సమాచారం పొందే హక్కు ఉందన్నారు. సమావేశంలో జిల్లా కార్యదర్శి ఆశిష్ బోరా, డివిజన్ అధ్యక్షుడు ఆనంద్‌కుమార్, ప్రతినిధులు విజయ్, నరేష్, ప్రకాశ్, రమేష్ పాల్గొన్నారు.
తాజా వార్తలు
జిల్లా వార్తలు