close

శనివారం, డిసెంబర్ 07, 2019

ప్రధానాంశాలు

కార్మికుల ఆత్మహత్యలు ప్రభుత్వ హత్యలే: తమ్మినేని

సమావేశంలో మాట్లాడుతున్న సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని

ఖమ్మం మయూరిసెంటర్‌, న్యూస్‌టుడే: ఆర్టీసీ కార్మికుల ఆత్మహత్యలు ప్రభుత్వ హత్యలేనని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. ఖమ్మం నగరంలోని సుందరయ్యభవన్‌లో శుక్రవారం నిర్వహించిన జిల్లా కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. గత 42 రోజులుగా తమ సమస్యలు పరిష్కరించాలని, తమను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాని కార్మికులు సమ్మె చేస్తున్నా ప్రభుత్వం వారితో చర్చలు జరపకపోవడం శోచనీయమన్నారు. సాక్షాత్తూ రాష్ట్ర హైకోర్టు అనేక సందర్భాల్లో కార్మికుల సమ్మె పట్ల స్పందించాలని సూచించినా కేసీఆర్‌ సూచనలను లెక్కచేయకపోవడం ఏమిటని ప్రశ్నించారు. ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటే మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు కనీసం స్పందించడం లేదని మండిపడ్డారు. కేసీఆర్‌ అనుచిత వ్యాఖ్యలతో మనోవేదనకు గురైన కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్టీసీ ఐకాస పిలుపులో భాగంగా ఈనెల 16 నుంచి 18 వరకు దీక్షలు, 19న సడక్‌ బంద్‌లో పార్టీ శ్రేణులు పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు. సమావేశంలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పోతినేని సుదర్శన్‌రావు, జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు, రాష్ట్ర కమిటీ సభ్యులు పొన్నం వెంకటేశ్వరరావు, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు కల్యాణం వెంకటేశ్వరరావు, బత్తుల లెనిన్‌, బండి రమేశ్‌, మాచర్ల భారతి, జిల్లా కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.