close

బుధవారం, డిసెంబర్ 11, 2019

ప్రధానాంశాలు

విశ్రాంత ఉద్యోగులు.. అవిశ్రాంత సేవాభావం

నేడు ధర్మపురి గాయత్రీ నిత్యాన్నదాన సత్రం వార్షికోత్సవం

ధర్మపురి, న్యూస్‌టుడే: వారంతా విశ్రాంత ఉద్యోగులు. సత్సంకల్పంతో అవిశ్రాంతంగా నరసింహుడి భక్తులకు అన్నదానం చేస్తున్నారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తుల ఆకలి తీర్చాలనే ఆశయంతో 2016లో శుచి, శుభ్రతతో నిత్యాన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ధర్మపురి పట్టణానికి చెందిన పలువురు ఉద్యోగులు ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలోని పలు ప్రాంతాల్లో పని చేసి ఉద్యోగ విరమణ చేశారు. విశ్రాంత జీవనంలో ఏదైనా సమాజ సేవా కార్యక్రమాన్ని చేపడతామనే సంకల్పంతో 2016 నవంబరు 18న అన్నదాన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మన రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు ధర్మపురికి వస్తుంటారు. కాగా స్థానికంగా సరైన భోజన సదుపాయాలు అందుబాటులో లేక ఇబ్బంది పడుతున్నారు. ఈ విషయాన్ని చర్చించుకున్న విశ్రాంత ఉద్యోగులు శ్రీగాయత్రీ బ్రాహ్మణ నిత్యాన్నదాన సత్రం పేరుతో సేవలు ప్రారంభించారు. నిర్వహణ కోసం కమిటీని ఏర్పాటు చేసుకున్నారు. అధ్యక్షుడిగా ఒఝల సీతారాంశర్మ, కార్యదర్శిగా సంగనభట్ల విశ్వనాథం, అసోసియేట్‌ అధ్యక్షుడిగా మధ్వాచారి రాంకిషన్‌శర్మ, గుండి రాములు, ఉపాధ్యక్షుడిగా కొరిడే శంకర్‌శర్మ, ఆర్గనైజింగ్‌ కార్యదర్శిగా బొజ్జా శంకర్‌ వ్యవహరిస్తున్నారు. 120 మంది సభ్యులు రూ.10 లక్షల మూల ధనాన్ని డిపాజిట్‌ చేశారు. నిత్యం రుచికరమైన ఆహారంతో ఉచితంగా భక్తులకు అన్నదానం చేస్తున్నారు. 30 నుంచి 50 మంది భక్తుల ఆకలి తీరుస్తున్నారు. ఆదివారం గాయత్రీ తృతీయ వార్షికోత్సవం నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.